ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్ - రామేశ్వరం మధ్య 18 సర్వీసులు నడపనున్నట్లు పేర్కొంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అన్ని శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30గంటలకు రైలు బయలుదేరుతుందని చెప్పింది.
హైదరాబాద్–తిరుచిరాపల్లికి 16 సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. అన్ని సోమవారాల్లో రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుందని పేర్కొంది. విల్లుపురం–సికింద్రాబాద్‌కు 18 సర్వీసులు నడపనున్నట్లు చెప్పింది. అన్ని బుధవారాల్లో విల్లుపురంలో సాయంత్రం 4 గంటలకు ట్రైన్ బయలుదేరుతుందని తెలిపింది.
అన్ని శుక్ర, ఆదివారాల్లో చైన్నెసెంట్రల్ నుంచి సికింద్రాబాద్‌కు 34 సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు శని, సోమవారాల్లో సికింద్రాబాద్‌కు చేరుకుని, తిరిగి అవే రోజుల్లో రాత్రి 8 గంటలకు చెన్నై బయలుదేరనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ – కొచువెలికి 17 సర్వీసులు, హైదరాబాద్ – ఎర్నాకులం మధ్య 18 సర్వీసులు నడపనున్నట్లు పేర్కొంది.