Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా ఎఫెక్ట్‌: పలు రైళ్లు రద్దు... రైల్వే శాఖ నిర్ణయం

కరోనా ఎఫెక్ట్‌: పలు రైళ్లు రద్దు... రైల్వే శాఖ నిర్ణయం
, బుధవారం, 18 మార్చి 2020 (08:47 IST)
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖ, భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌ పూరీ మధ్య నడిచే ఎనిమిది ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. 
 
ప్రత్యేక రైళ్లతో పాటుగా మరో 23 రైళ్లను ఈ నెల 30 వరకు రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రజలను కరోనా వైరస్‌ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందని.. అందుకే ఈ నెల 31 వరకు ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. 
 
రద్దు అయిన రైళ్ల వివరాలు...
11008 – పుణె-ముంబయి దక్కన్‌ ఎక్స్‌ప్రెస్‌– మార్చి 18 నుంచి 30 వరకు
11007 – ముంబై-పుణె డెక్కన్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి మార్చి 31 వరకు
11201 - ఎల్‌టీటీ-ఏజేఎన్‌జే ఎక్స్‌ప్రెస్‌ - మార్చి 23, మార్చి 30
11202 – ఏజేఎన్‌జే-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ –  మార్చి 20, మార్చి 27
11205 - ఎల్‌టిటి-నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 21 మరియు మార్చి 28 న మాత్రమే
 
11206 - నిజామాబాద్-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ - మార్చి 22 మరియు మార్చి 29 న మాత్రమే
22135/22136 - నాగ్‌పూర్-రేవా ఎక్స్‌ప్రెస్ - మార్చి 25న మాత్రమే
11401 - ముంబయి-నాగ్‌పూర్ నందిగ్రామ్ 
ఎక్స్‌ప్రెస్ - మార్చి 23 నుంచి ఏప్రిల్ 1 వరకు
11402 - నాగ్‌పూర్-ముంబై నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 22 నుంచి మార్చి 31 వరకు
11417 - పుణె-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 26, ఏప్రిల్ 2న
11418 - నాగ్‌పూర్-పుణె ఎక్స్‌ప్రెస్ - మార్చి 20, 27న 
22139 - పుణె-అజ్ని ఎక్స్‌ప్రెస్ - మార్చి 21, 28న
22140 - అజ్ని-పుణె ఎక్స్‌ప్రెస్ - మార్చి 22, 29న
 
12117/12118 - ఎల్‌టిటి-మన్మాడ్‌ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు
12125 - ముంబయి-పుణె ప్రగతి ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు
12126 - పుణె-ముంబయి ప్రగతి ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి ఏప్రిల్ 1 వరకు
22111 - భూసవల్-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 29 వరకు
22112 - నాగ్‌పూర్-భూసావల్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి మార్చి 30 వరకు
 
11307/11308 - కలబురగి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు
12262 - హౌరా-ముంబయి దురంతో ఎక్స్‌ప్రెస్ - మార్చి 24, మార్చి 31న మాత్రమే
12261 - ముంబయి-హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ - మార్చి 25, ఏప్రిల్ 1న మాత్రమే
22221 - సీఎస్‌ఎంటీ-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ - మార్చి 20, 23, 27, 30న మాత్రమే
22222 - నిజాముద్దీన్-సీఎస్‌ఎమ్‌టీ రాజధాని ఎక్స్‌ప్రెస్ - మార్చి 21, 24, 26, 31న మాత్రమే

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కల్లోలం : ప్రేమ మందర సందర్శన నిలిపివేత...