Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగల 3 రోజుల్లో కోస్తా ఆంధ్రాలో వర్షాలు

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:52 IST)
దక్షిణ జార్ఖండ్‌ నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఇంటీరియర్ ఒరిస్సా, దక్షిణ ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, రాయలసీమ మరియు  ఇంటీరియర్ తమిళనాడు  మీదుగా 0.9 కీమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
 
కోస్తా ఆంధ్ర మరియు యానాంలలో ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం  జిల్లాలలో ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ  కురిసే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి  ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కీమీ) పాటు  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు అక్కడ అక్కడ  కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు  దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ  కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
 
ఈ రోజు  అనంతపురం కర్నూలు జిల్లాలలో ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి  రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments