Publish Date: Thu, 09 Apr 2020 (19:09 IST)
Updated Date: Thu, 09 Apr 2020 (19:15 IST)
ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటన విడుదల చేశారు.
తూర్పు మధ్యప్రదేశ్ దానిని ఆనుకుని ఉన్న చత్తీస్ గఢ్ ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు తూర్పు విదర్భ, తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా 0.9 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
ఈ రోజు విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలలో అక్కడ అక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 km) పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలోని చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులుతో పాటు, తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలోని చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈ రోజు ప్రకాశం నెల్లూరు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 km) పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ రోజు కడప జిల్లాలో అక్కడ అక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 km) రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది మరియు అక్కడక్కడ 40 నుండి 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది
రేపు రాయలసీమలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
తిరుమలలో జోరు వాన
తిరుమలలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుండి అగ్గిని కురిపించిన భానుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. తిరుమలలో ఉన్నపళంగా అకాశం మబ్బులు కమ్ముకొని జోరున వాన కురవడంతో భానుడు శాంతించాడు. దీనికి తోడు హోరున గాలులు కూడా తోడవడంతో తిరుమల మొత్తం ఒక్కసారిగా చల్లటి వాతావరణం నెలకొంది.