Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పార్టీ వాళ్లు హత్యలు.. అత్యాచారాలు చేసినా కాపాడేందుకు పెద్దలున్నారు : ఆర్ఆర్ఆర్

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (16:47 IST)
తమ పార్టీ వారు హత్యలు, అత్యాచారాలు చేసినా కాపాడుకునేందుకు తమ పార్టీలో పెద్దలు ఉన్నారని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఏపీలోని వైకాపా ప్రభుత్వం నిర్ణీత గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయలేక పోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. పైగా, తమ పార్టీ వాళ్లు ఏం చేసినా కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అనంతబాబుకు బెయిల్ మంజూరు కావడంతో ఆర్ఆర్ఆర్ స్పందిస్తూ, అనంతబాబు తమ పార్టీవాడు కాబట్టే కాపాడుకున్నామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చార్జిషీట్ దాఖలు చేయలేకపోవడంతో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని గుర్తుచేశారు. తమ పార్టీలో వాళ్లు హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా కాపాడటానికి తమ ప్రభుత్వ పెద్దలు ఉంటారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, చివరుక కార్పొరేషన్లను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments