Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవే నా చివరి ఎన్నికలు.. గెలిపిస్తే అసెంబ్లీకి లేదంటే ఇంటికే : చంద్రబాబు

Advertiesment
chandrababu
, గురువారం, 17 నవంబరు 2022 (14:00 IST)
కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో జరిగిన రోడ్‌షోకు భారీగా తరలివచ్చిన వారిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ 2024లో ఎన్నికలే తన చివరి ఎన్నికలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తానని లేదంటే ఇంటికే పరిమితమవుతానని చెప్పారు. 
 
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు తాను అడ్డుపడుతున్నానంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. పైగా, జగన్ ఎంపీలను ఢిల్లీకి అమ్ముకున్నారని ఆరోపించారు. వైకాపా ఎంపీలు రాష్ట్రానికి ఏమైనా పనికొస్తున్నారా అని నిలదీశారు. 
 
తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను నిలిపివేస్తానంటూ వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, తాను నిలిపివేయనని మరింతగా ఇస్తామన్నారు. ఇందుకోసం అప్పులు చేయనని, సంపదను సృష్టిస్తానని తెలిపారు. పైగా, జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఇస్తున్న నిధులు నాన్న బుడ్డికి సరిపోతున్నాయన్నారు. నిత్యావసర వస్తు సరకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరిస్తున్నారన్నారు.
 
మూడు రాజధానులు మూడు ముక్కలాటగా మార్చి ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే వైకాపా గూండాలు అరాచకాలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడేడి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ సైకో ముఖ్యమంత్రి జగన్‌ను ఇంటికి పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెరాసలో చేరనున్న ఈటల రాజేందర్? ... సీఎం కేసీఆర్ చేస్తున్న దుష్ప్రచారమట..