తెరాసను వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తిరిగి సొంత గూటికి రాబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం ఆయన స్పందించారు. ఘర్ వాపసీ పేరుతో సీఎం కేసీఆర్ చేస్తున్న దుష్ప్రచారం అని కొట్టిపారేశారు.
ఈటల రాజేందర్ తిరిగి తెరాస గూటికి చేరుతారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఘర్ వాపసీ పేరుతో ఇది సాగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ, తెరాసలో తాను 20 యేళ్ళు పని చేశానని, 28 మంది ఎమ్మెల్యేల్లో పది మంది బయటకు వెళ్లిపోయాని తాను మాత్రం పార్టీని వీడలేదని ఈటల చెప్పారు.
తెరాస తీవ్ర సంక్షోభంలో ఉన్నపుడు కూడా తాను పార్టీ మారలేదని చెప్పారు. పైగా, తాను తెరాసను వీడలేదన్నారు. సీఎం కేసీఆర్ బయటకు పంపించారన్నారు. తన అంకితభావం ఎలాంటిదో అందరి కంటే కేసీఆర్‍కే ఎక్కువ తెలుసని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెరాస తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.