సినిమా అవకాశాల కోసం తాను కమిట్మెంట్ ఇచ్చే రకం కాదని, అవసరమైతే ఉద్యోగం చేసుకుంటానని హీరోయిన్ కీర్తి సురేష్ అన్నారు. పైగా, చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఉన్న మాట నిజమేనని ఆమె చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమె తాజాగా స్పందిస్తూ, చిత్రపరిశ్రమలో అవకాశాల కోసం చూసే మహిళలకు వేధింపులు నిజమేనని చెప్పారు. అయితే తన వరకు ఇంతవరకూ అలాంటి అనుభవం ఎదురుకాలేదన్నారు.
ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం సినిమాలు మానేసి ఉద్యోగం చేసుకుంటానని చెప్పారు. అంతేకానీ, అవకాశాల కోసం తాను కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదని స్పష్టం చేశారు. మీ టూ ఉద్యమం వచ్చాకే సినిమా రంగంలోని క్యాస్టింగ్ కౌచ్ విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే.
దీనిపై ఆమె స్పందిస్తూ, తనతో పాటు నటించిన కొందరు హీరోయిన్లు, ఇతర నటీనటులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిర్గతం చేశారన్నారు. మన ప్రవర్తన ఎలా ఉందనేది కూడా ఈ విషయంలో ముఖ్యమన్నారు. మనం ఎలా ఉంటున్నాం.. ఏం చేస్తున్నామనేదాన్ని బట్టి కమిట్మెంట్ అడుగుతారేమోనని కీర్తి సురేష్ అభిప్రాయపడ్డారు. అందుకే తనకు ఇంతవరకు అలాంటి సందర్భం ఎదురుకాలేదన్నారు.