Webdunia - Bharat's app for daily news and videos

Install App

416వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (11:01 IST)
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 416వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు  కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. తాము గాంధేయమార్గంలో నిరసనలు తెలియజేస్తుంటే సీఎంకి ఎందుకంత భయం అని రైతులు ఈ సందర్భంగా ప్రశ్నించారు.

అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతూ తుళ్లూరు రైతు శిబిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవ మత బోధకుడు దేవునివాక్యం చదివారు. మహిళలు గీతా పారాయణం చేశారు.  మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడకలో రైతులు, మహిళలు ఆందోళనలు నిర్వహించారు. మూడు రాజధానుల ప్రకటనను వెనకకు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments