విశాఖ ప్రమాదంపై నివేదిక అందజేత...శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం

Webdunia
బుధవారం, 15 జులై 2020 (08:50 IST)
విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్‌ కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌  వినయ్ చంద్ నియమించిన విచారణ కమిటీ నివేదిక అందజేసింది.

ఐదుగురు సభ్యులతో కూడా కూడిన ఈ కమిటీ.. ప్రమాదంపై పూర్తి స్థాయిలో నివేదికను రూపొందించింది. ప్రమాదం జరిగిన తీరు ఆ తర్వాత  నెలకొన్న పరిణామాలపై రెండు పేజీల నివేదికను కలెక్టర్‌కు అందజేసింది.

సాల్వెంట్‌ రికవరీ రియాక్టర్‌ వద్ద డై మిథైల్ సల్ఫాక్సైడ్ శుద్దిచేసే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా కమిటీ నివేదికలో పేర్కొంది. సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేయడంలో విఫలం కావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు కమిటీ సభ్యులు ప్రాథమికంగా అంచనా వేశారు.
 
శ్రీనివాసరావు కుటుంబానికి పరిహారం
విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్‌ ఫాక్టరీ జరిగిన ప్రమాదంలో మృతిచెందిన శ్రీనివాస్‌రావు కుటుంబానికి యజమాన్యం తరఫున రూ. 35 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 15 లక్షల పరిహారం అందజేయనున్నారు.

అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మల్లేష్‌కు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments