Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై త్వ‌ర‌లోనే తుది నివేదిక: హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్‌కుమార్ ప్రసాద్

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై త్వ‌ర‌లోనే తుది నివేదిక: హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్‌కుమార్ ప్రసాద్
, మంగళవారం, 16 జూన్ 2020 (21:18 IST)
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మరియు ఇతర అందరి సభ్యుల నుంచి సేకరించిన సమాచారం ఆదారంగా తుది నివేదికను త్వరలో సిద్ధం చేయనున్నామని హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్‌కుమార్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మే 5, 2020 తెల్లవారుజామున 3 గంటలకు విశాఖపట్నం జిల్లా ఆర్.ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ లో సంభవించిన ప్రమాద ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన విషయం తెలిసిందేనని ఆయన తెలిపారు.

సదర్ హైపవర్ కమిటీని గ్యాస్ స్టోరేజ్ ట్యాంక్ నుండి గ్యాస్ లీక్ అవ్వటానికి కారణమైన అంశాలను గురించి వివరాలు సేకరించడానికి తదనంతరం తీసుకున్న నివారణ చర్యలు గురించి అధ్యయనం చేయటానికి ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని ఆయన తెలిపారు.

తన పనిలో భాగంగా తమ కమిటీ ఇప్పటికే సంబంధం ఉన్న అందరి నుండి సలహాలు, సూచనలు ప్రశ్నలు సేకరించడం జరిగిందని హైపవర్ కమిటీ చైర్మన్ శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. దానిలో భాగంగా 243 రిప్రజెంటేషన్ 175 టెలిఫోన్ పబ్లిక్ వాట్సాప్ ను రిసీవ్ చేసుకున్నామన్నారు.

దాని ఆధారంగా కమిటీ ఒక ప్రశ్నావళి రూపొందించి ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ మరియు ఇతర రెగ్యులేటరీ అధారిటీ ద్వారా అందించడం జరిగిందని, ఇంకా ఎల్జీ పాలిమర్స్ నుంచి జవాబు అందాల్సి ఉందని ఆయన తెలిపారు.

కొంతమంది రెగ్యులేటర్స్  నుంచి సమాధానాలు వచ్చినప్పటికీ ఇంకా కొంతమంది తమ సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను హైపవర్ కమిటీ తుది జాబితాలో పొందుపరచడం జరుగుతుందని ఆయన తెలిపారు.

మే 9, 10, 11, 2020 మరియు 6, 7, 8, 2020 న తెలిపిన ఈ రోజుల్లో విశాఖపట్నం సందర్శించిన హైపవర్ కమిటీ స్టేక్ హోల్డర్స్ అందరితో సుదీర్ఘ చర్చలు నిర్వహించిందన్నారు.

జూన్ 15, 2020 నాడు డాక్టర్ సాగర్ ధార ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ హైదరాబాద్ మరియు డాక్టర్ బాబురావు సైంటిస్ట్ హైదరాబాద్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు.

యాక్సిడెంట్‌కి సంబంధించి మరియు ప్రమాదానికి సంబంధించిన కారణాలు తదనంతర ఘటనలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చే వారంలో హైపవర్ కమిటీ మరిన్ని సమావేశాలు రెగ్యులేటరీ ఆథారిటీతో కలిపి నిర్వహించనుందని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోలుకున్న యుఎస్ డాలర్: తగ్గుతున్న పసిడి ధరలు