తనిఖీల్లో 57 కేజీల వెండి, తుపాకి స్వాధీనం... పోలీసులు షాక్..ఎక్కడ?

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (11:40 IST)
ఎపి సరిహద్దుల్లో ఎస్‌ఇబి, పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరే వెండి బయటపడటంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. గంజాయి, అక్రమ మద్యం, హవాలా డబ్బు, బంగారం వంటి అక్రమాలకు చెక్‌ పెడుతూ పోలీసులు ఇటీవల తనిఖీలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీగా డబ్బు, బంగారం, అక్రమ మద్యం పట్టుబడుతోంది.

తాజాగా పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో ఈ సోదాలు మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న వెండిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వడమాలపేట మండలం ఎస్‌వి.పురం టోల్‌ ప్లాజా దగ్గర పోలీసులు చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు.

తనిఖీల్లో భాగంగా శనివారం ఉదయం తమిళనాడుకు చెందిన కారులో సోదాలు చేపట్టగా.. అందులో 57 కేజీల వెండి ఆభరణాలతో పాటు తుపాకీ ఉన్నట్లు గుర్తించారు. ఆభరణాల విలువ రూ.41,99,164 ఉంటుందని అంచనా వేస్తున్నారు. కారుతో సహా 57 కిలోల వెండిని, తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఈ వెండి ఆభరణాలను చెన్నైలోని లలితా జ్యువెలరీ నుంచి తిరుపతిలోని లలితా జ్యువెలరీకి తీసుకువస్తున్నట్లు కారు డ్రైవర్‌ డాక్యుమెంట్లను పోలీసులకు చూపించారు. అయితే, రసీదులు సక్రమంగా ఉన్నాయా? లేదా? అని తెలుసుకోడానికి పోలీసులు పుత్తూరు కమర్షియల్‌ ట్యాక్స్‌ కార్యాలయానికి పంపారు. కారులో ఉన్న తుపాకీకి లైసెన్స్‌ ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికలు ఉండటంతో సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments