Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీసులు అందరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: సీపీ సత్యనారాయణ

పోలీసులు అందరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: సీపీ సత్యనారాయణ
, శుక్రవారం, 22 జనవరి 2021 (21:09 IST)
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో "32వ నేషనల్ రోడ్డు సేఫ్టీ నెల"లో భాగంగా ఏసీపీ ట్రాఫిక్ బాలరాజ్, సీఐ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీ గురించి పోలీస్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
 
ఈ సందర్బంగా సీపీ గారు మాట్లాడుతూ.... పోలీసులు అందరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి - ప్రజలకు ఆదర్శంగా నిలవాలి అన్నారు. రూల్‌ ఈజ్‌ రూల్‌... రూల్‌ ఫర్‌ ఆల్‌ అనే మాట తరచూ వింటుంటాం.. ప్రజలు మాత్రమే నిబంధనలు పాటించాలి.. ప్రభుత్వ అధికారులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించొచ్చు అని ఇలాంటి మాటలు వింటుంటాం, అంటుంటాం. ముఖ్యంగా పోలీసులు విషయంలో ప్రజలు మరింత అసంతృప్తిని వెలిబుచ్చుతుంటారు. వాహనదారులు ఏ చిన్న ట్రాఫిక్‌ నిబంధన పాటించకపోయినా ట్రాఫిక్‌ పోలీసులు వెంటబడించి మరీ వాహనాలను అడ్డుకుంటారు. వందల్లో, వేలల్లో జరిమానా విధిస్తుంటారు.
 
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ప్రయాణిస్తున్న సమయంలో జరిమానాలు విధిస్తూ, వాహనాలు ఆపుతూ వాగ్వదాం చేస్తారు. ఆ ప్రవర్తనతో అవమానంగా భావిస్తారు. అదే పోలీసులు హెల్మెట్‌, లైసెన్స్‌ లేకపోయినా, అసలు బండి కాగితాల్లేకున్నా యథేచ్ఛగా, దర్జాగా వెళ్తుంటారు. వారికి చలానాలు, జరిమానాలు విధించిన సంఘటనలు చాలా అరుదు. ఇలాంటి క్రమంలో పోలీసుల తీరుపై వాహనదారులు మండిపడుతుంటారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెడుతుంటారు.
 
నిబంధనలు ప్రజలకేనా, పోలీసులకు వర్తించవా అంటూ తమ అసహనాన్ని, ఆవేదనను వెల్లగక్కుతుంటారు. ఇలాంటి పరిస్థితికి చెక్‌ పెట్టాలని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ వి. సత్యనారాయణ ఐపీఎస్ గారు సిబ్బందికి ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించి అనంతరం  ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది వాహనాలను పరిశీలించారు.
 
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని పోలీస్ సిబ్బందికి అందరికి వాహనాలు ఉన్న లేకున్నా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండేలా తప్పకుండా చూడడం జరుగుతుంది అని సీపీ గారు అన్నారు.
webdunia
police
ఒక నెల రోజులలో రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని సిబ్బంది వాహనాలకి సంబందించిన అన్ని పత్రాలు మరియు హెల్మెట్ తప్పనిసరిగా ఉండేలా చూడాలి అని సీపీ గారు అధికారులకు సూచించారు. ప్రజలను ఇబ్బందికి గురిచేయడం, జరిమానాలు విధించడం మా ఉద్దేశ్యం కాదు. ఇంటి నుండి బయలుదేరిన వాహనదారులు క్షేమంగా గమ్యం చేరేలా చూడడం, అందరు ట్రాఫిక్ రూల్స్ పాటించేలాగా చూడడమే మాత్రమే మా పోలీస్ ప్రధాన లక్ష్యం అన్నారు.
 
మంచిర్యాల ట్రాఫిక్ సిబ్బంది అందరు వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్, హెల్మెట్ అన్ని ఉండేలాగా, ప్రజలకు ఆదర్శంగా ఉండేలా సిబ్బందికి అవగాహన కల్పించిన ట్రాఫిక్ మంచిర్యాల సీఐ ప్రవీణ్ కుమార్‌ని సీపీ గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మంచిర్యాల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ ట్రాఫిక్ రామగుండం బాలరాజ్, సీఐ ట్రాఫిక్ మంచిర్యాల ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ లు వినోద్, సురేందర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొగాకు చిల్లర వర్తకులపై కోట్పా చట్టం ప్రభావం: ఉపసంహరించుకోవాలని ఎఫ్‌ఆర్‌ఏఐ తెలంగాణా అభ్యర్థన