Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళా భద్రత లో ఏ.పి పోలీస్ మరో ముందడుగు

మహిళా భద్రత లో ఏ.పి పోలీస్ మరో ముందడుగు
, బుధవారం, 6 జనవరి 2021 (20:11 IST)
పోలీసు శాఖతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తమ వంతు పాత్ర పోషించినపుడే మహిళా భద్రత సాధ్యమవుతుందని రాష్ట్ర గౌ.డి.జి.పి గౌతమ్ సవాంగ్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఏ.ఆర్. పోలీస్ పెరేడ్ మైదానంలో ఇగ్నైట్ - 2020 63 వ ఏ.పి మొట్టమొదటి పోలీస్ డ్యూటీ మీట్ లో భాగంగా  ప్రతిష్టాత్మక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ దువ్వూరి జామున తో మహిళా భద్రతకు సంబంధించి ఎం.ఓ.యు (అవగాహన ఒప్పందం) కుదుర్చుకున్నారు.

ఈ సందర్బంగా డి.జి.పి మాట్లాడుతూ.. మహిళల సంబంధిత నేరాలు నిరోధించడంలో ఈ అవగాహన  ఒప్పందం కీలక ఘట్టంగా మారబోతుందన్నారు. రాష్ట్రంలోనే ఏకైక మహిళా విశ్వవిద్యాలయమైన ఎస్.పి.ఎం.వి.వి తో  మహిళా భద్రతకు సంబంధించి భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణ సంస్థ, పూర్తిగా మహిళలకు సంబంధించిన విశ్వవిద్యాలయం మహిళా సమస్యలు, మహిళా సంబంధిత రక్షణ తదితర అంశాలపై కలిసి పనిచేసేందుకు కృషి చేయడం. అత్యంత  ప్రాధాన్యత గల ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత గానే  కాకుండా అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి కూడా  లింగ సమానత్వం, లింగ సంతులనం, సమానత్వం పై డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగిందన్నారు.

మహిళా భద్రతకు ఒక కేంద్రంగా నిలవడమే కాకుండా విద్యాలయం నుండి క్షేత్ర స్థాయి వరకూ కృషి చేయాలనీ సూచించారు. మహిళా భద్రత అనే అంశం ఒక రాష్ట్ర, దేశ అంశం కాదని,  ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు, సవాళ్ళను ముందుగా గుర్తించి, అర్ధం చేసుకున్నప్పుడు  వాటి పరిష్కారం సుళువవుతుందన్నారు.

కేవలం సామజిక చట్టం ఏర్పాటు తో సమస్యకు పరిష్కారం కాదన్నారు. అందుకు సంబందించిన ప్రత్యేక వ్యవస్థను  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సత్వర న్యాయానికి వీలుగా పకడ్బందీ గా దిశ చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. దిశ' పోలీస్ స్టేషన్ల ను అందులో ఒక డి.ఎస్.పి, ఇన్స్పెక్టర్, ఐదుగురు ఎస్.ఐ లు, వారికి కావాల్సిన వాహనాలు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అన్ని అందజేయడం జరిగిందన్నారు.

దిశలో విధులు నిర్వర్తించే వారికీ ప్రతేకంగా ప్రోత్సాహక అలవెన్స్ అందచేస్తున్నామన్నారు. దర్యాప్తు సామర్ధ్యాన్ని పెంపొందించేందుకునేందుకు ఆయా వైద్య శాలల్లో దిశ బాధితుల కు  చికిత్సతో పాటు  త్వరితగతిన డి.ఎన్.ఏ టెస్టులు నిర్వహించేందుకు వైజాగ్, తిరుపతి లలో ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 'దిశ' చట్టం అమలుకే మంగళగిరి తో పాటు మరో రెండు చోట్ల ల్యాబ్ లను ప్రారంభించడం జరిగిందన్నారు. 

కేవలం 48 గంటల్లోపు  నివేదిక వస్తుందని, విచారణ పూర్తిచేసి ఛార్జ్ షీట్ దాఖలుకు మార్గం సుగమం అవుతుందన్నారు. గతంలో మహిళా సంబంధిత నేరాల్లో ఛార్జ్ షీట్ దాఖలు కు  200 రోజులు పైగా పట్టేదని, గత సంవత్సరం 100 రోజులుగా ఉందని, 2020 సంవత్సరంలో సగటున 53 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయగలగడం పోలీస్ శాఖ సామర్ధ్యాన్ని సూచిస్తుందన్నారు.

ప్రాసిక్యూషన్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు. కేవలం దిశ కేసుల కోసమే వీరిని నియమించడం వల్ల దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన విచారణ జరిగి కేసుల్లో న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. 'దిశ' కు సంబంధించి ప్రత్యేక కోర్టులు కూడా త్వరలో రానున్నాయన్నారు.  ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, సంఘటితంగా మహిళా భద్రత కు కృషిచేయాలని డి.జి.పి కోరారు. 
 
మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏ.ఆర్ అనురాధ ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ కీలకమైన మహిళా శిశు సంక్షేమ శాఖకు ఒక మహిళా ఐ.పి.ఎస్ అధికారి ఐన తనను,  'దిశ' ఎస్.పి గా దీపికా పాటిల్ ను నియమించడం మహిళలకు, చిన్నారుల సంక్షేమం పట్ల ప్రభుత్వ ప్రాధాన్యత ను సూచిస్తోందన్నారు. మహిళల సంబంధిత కేసుల్లో  ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.

శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ దువ్వూరి జమున మాట్లాడుతూ విశ్వవిద్యాలయం క్యాంపస్ లో 5,500 మంది కి పైగా ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిపారు. మహిళా భద్రతకు సంబంధించి రాష్ట్ర పోలీస్ శాఖతో కలిసికట్టుగా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఏ.పి ప్రభుత్వం, పోలీసు శాఖ అంచనాలకు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేందుకు అంకితభావంతో కృషి చేస్తామని ఆమె తెలిపారు.

కార్యక్రమంలో అదనపు డి.జి లు శ్రీధర్ రావు, 'దిశ' ఎస్.పి దీపికా పాటిల్, సి.ఐ.డి ఎస్.పి రాధిక, మహిళా ఐ.పి.ఎస్ అధికారులు గౌతమీ శాలి, అజిత, ప్రేరణ, పెద్ద ఎత్తున విద్యార్థిని, విద్యార్థులు, మహిళలు, పోలీసు అధికారులు  పాల్గొన్నారు.
 
డి.ఎస్.పి జెస్సీ ప్రశాంతి, సి.ఐ శ్యాంసుందర్ ల ను  ఘనంగా సన్మానించిన యాక్సిస్ బ్యాంక్ :
గుంటూరు సౌత్ లో డి.ఎస్.పి గా విధులు నిర్వర్తిస్తున్న జెస్సీ ప్రశాంతి ని, పి.టి.సి కళ్యాణి డ్యామ్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంతి తండ్రి శ్యాం సుందర్ లను యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

తండ్రి, కుమార్తె ఒకే చోట విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారి అయిన  కుమార్తె కు సెల్యూట్ చేసే అరుదైన దృశ్యం రెండు రోజుల కిందట ఇగ్నైట్ - 2020 వేదిక వద్ద ఆవిష్కృతమైంది. ఇదే అంశం ప్రసార మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇలాంటి అరుదైన సన్నివేశానికి ఏ.పి పోలీస్ డ్యూటీ మీట్ ఇగ్నైట్ - 2020 వేదికగా మారింది.

ఈ సందర్బంగా తండ్రి శ్యాం సుందర్ మాట్లాడుతూ తాను తన కూతురు తో కలిసి విధులు నిర్వర్తిస్తానని ఎన్నడూ ఊహించలేదన్నారు. కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకొని ప్రజలకు సేవ చేసే పోలీసు శాఖ ను తన కుమార్తె ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇతర పోస్టు వచ్చినా సేవ చేసే అవకాశం పోలీసు శాఖ వల్లనే సాధ్యమవుతుందని డి.ఎస్.పి పోస్టును తన  కుమార్తె ఎంపికచేసుకుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెల్‌డన్ ఫాదర్, శభాష్ డాటర్: సిఐ, డిఎస్పీకి డిజిపి సెల్యూట్