Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బండి సంజయ్‌కు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్

బండి సంజయ్‌కు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్
, మంగళవారం, 5 జనవరి 2021 (21:19 IST)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘’ఎవరో ఒక తెలంగాణ బీజేపీ లోకల్ నాయకుడు ఏం మాట్లాడుతున్నారో తెలియదు.. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. బైబిల్ పట్టుకున్నవారికి ఓటు వేస్తారా? భగవద్గీత పట్టుకున్నవాళ్లకు ఓటు వేస్తారా? అని.. ఇంత లోలెవల్‌కు దిగిపోతారా? మాట్లాడేముందు నేషనల్ లీడర్లతో కన్సాల్ట్ చేయాలి.. భగవత్, రామ్‌లాల్ గారు నాతో చక్కగా మాట్లాడతారు.
 
ఆర్ఎస్ఎస్ నాయకులు ఇంద్రస్, బయాజోషి ఎన్నోసార్లు నా హోటల్‌కు వచ్చారని, రామ్‌లాల్ అయితే నా మోకాలు తాకి, నా చేతికి కిస్ చేశారు. దేశమే కాపాడాలండి పాల్ గారూ అని ఎంతో గౌరవించారు. మీరు బీజేపీకి సపోర్టు చేయాలని, అభివృద్ధి చేద్దాం, అవినీతి నిర్మూలన చేద్దామన్నారు.
 
 
200 దేశాల్లో నరేంద్రమోదీ బ్లాక్ లిస్టులో ఉన్నప్పుడు ఆయన కూడా ఎంతో గౌరవించారని.. 120 రోజ్ ప్లవర్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 ఫోటోలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నన్ను గౌరవంగా చూస్తారు. అలాగే అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నడ్డా తదితరులు నా హోటల్‌కు వచ్చి కలిసారని, అభివృద్ధి చేద్దాం.. అందరిని కలుపుకుపోదామని అంటే.. కుళ్లు, కుట్రతో కొందరు రాజకీయ నాయకులు ఏపీ, తెలంగాణను రెచ్చగొడితే ఊరుకునేది లేదు.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి.. మోదీ ట్రంప్ చుట్టు తిరిగారు. 
 
ట్రంప్ నా చుట్టు 18 సంవత్సరాలు తిరిగారు.. చిత్తు చిత్తుగా ఓడిస్తానని చెప్పా.. ఓడించా.. దేవుడు నాతో, ప్రజలతో ఉన్నాడు... రెచ్చగొట్టవద్దు.. పరిశుద్ధ గ్రంథాలతో ఆటలాడవద్దు.. చంద్రబాబు నాయుడికి సిగ్గులేదు, నిన్నమొన్న ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి.. కొడుకును సీఎంను చేయాలని పగటికలలు కంటున్నారా?.. పాల్ గారూ ఏసుప్రభువు మహిమా, కృపా అని చెప్పి.. ఇప్పుడు క్తైస్తవులను తిడతారా?
 
 
పవన్ కల్యాణ్ ఇప్పుడైనా మేలుకో కరియాపాకును వాడుకుని ఎలా వదిలేస్తారో.. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ అభ్యర్థిని పెట్టి నిన్ను వదిలేశారు. ఒక పెద్ద కాపు నాయకుడు నాతో మాట్లాడారు. నిజంగా రాజకీయం చేయాలంటే హైందవులు, మహ్మదీయులు, క్రైస్తవులను కలుపుకుని వెళదాం.. అభివృద్ధి చేద్దాం.. 32 ఏళ్లు నేను అమెరికాలో కష్టపడి 2 వందల దేశాల్లో ఇండియాను నెంబర్ 3గా చేశాను.. ఇప్పుడు ఇండియా 144కు పడిపోయింది. 
 
ఇండియాలో అభివృద్ధి లేదు, అప్పులపాలైంది.. రైతులు ఢిల్లీలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అభివృద్ధి చేద్దామని మోదీ, అమిత్ షా, నడ్డా, అడ్వాణీ, వాజ్‌పేయి ఆనాడు నాకు ప్రామిస్ చేస్తే వాళ్లకు సపోర్టు  చేశాను. ప్రపంచంలో ఒక్క హిందూ దేశమైనా ఉందా? భారత దేశం ఇప్పటికే నష్టపోయింది.. ఇంకా నష్టపోకుండా కాపాడుకుంటూ వస్తున్నా.. మానవత్వమున్న ఏ ఒక్కరు కూడా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేయవద్దు’’అని కేఏ పాల్ పిలుపు ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆలయాల పేరుతో చెత్త రాజకీయం చేస్తున్నారు : సజ్జల రామకృష్ణారెడ్డి