Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది : విష్ణువర్ధన్ రెడ్డి

Advertiesment
Vishnuvardhan Reddy
, మంగళవారం, 19 జనవరి 2021 (19:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మానప్రాణాలు కాపాడాల్సిన పోలీసులకే ఇపుడు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. సాక్షాత్ ఓ జిల్లా ఎస్పీని నెల్లూరు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించారు. దీనిపై విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీలో పోలీసులు పోలీసులను రక్షించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
 
నేడు ఐపీఎస్‌లకు నువ్వు రెండు రోజుల్లో ఉండవు అని అల్టిమేటమ్ ఇచ్చే స్ధితికి వైసీపీ వచ్చింది. పోలీసు వ్యవస్ధ దిగజారిపోయింది. నిజాయితీ పరులైన పోలీసు అధికారులను వైసీపీ నేతల నుంచీ డీజీపీ రక్షించాలి. సుప్రీంకోర్టు న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా కొందరు పోలీసులు కేసులు పెడుతున్నారు. 
 
వైసీపీ ప్రభుత్వ కాలం 60 నెలలు ‌... పోలీసులు అరవై ఏళ్ళ వయసు వరకూ... ఐపీసీ ఏమైనా వైసీపీ‌గా మారిపోయిందా. ఐపీసీ ఒకవేళ వర్తించదంటే.. వైసీపీ చట్టం ఏమిటో చెప్పాలి. ఎస్సైలు, సీఐలు కొంతమంది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర పని చేస్తున్నారా. కర్నూలు జిల్లాలో ఒక ఎస్సై పార్టీ మారకపోతే ఎన్‌కౌంటర్ చేస్తానని మా కార్యకర్తని బెదిరిస్తున్నాడు. ఏపీ పోలీస్ వ్యవస్థ వైసీపీ కార్యాలయం నుండి నడుస్తుంది. 
 
పోలీస్ హెడ్ క్వార్టర్ వైసీపీ ఆఫీస్. పోలీసు అధికారులు సంఘం వైసీపీ కార్యకర్తల సంఘం గా మారిపోయింది. ప్రభుత్యం మారుతుంది, అధికారులు మారరు అని గుర్తెరిగి ప్రవర్తించండి. వైసీపీ ప్రభుత్యం గడిచిన కాలంలో అభివృద్ధిపై చర్చకు రావాలి.
 
కేవలం సవాళ్లు టీవీలో విసురుతారు. వాస్తవానికి వస్తే పడిపోతారు. కపిల తీర్థం నుండి రామతీర్థం యాత్రని అడ్డుకుంటే హిందువులను అడ్డుకున్నటే. రామమందిరం కోసం అద్వానీని అడ్డుకున్న కాంగ్రేస్ ప్రభుత్యం పరిస్థితి ఎలా మరిందో. వైసీపీది కూడా అంతే జరుగుతుంది.వైసీపీ పాలనలో హిందూ ధార్మిక సవస్థలకు, స్వామీజీలకు అడ్డుకుంటారు.

వైసీపీ నేతలు మైండ్ గేమ్‌లో భాగంగా ఢిల్లీలో బీజేపీ నేతలను కలుస్తున్నారు. రాష్ట్ర ప్రజలు దినిని నమ్మరు అనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఒక ఐపీఎస్ అధికారిని నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే  బహిరంగా బెదిరింపులకు దిగితే కేసు ఎందుకు పెట్టలేదు?
 
ప్రజా క్షేత్రంలో వైసీపీని ప్రతిపక్షంగా బిజెపి పార్టీ ఎండగడుతుంది. క్రైస్తవుడు ప్రవీణ్ చక్రవర్తి హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే ఎందుకు ఎప్పటివరకు అరెస్ట్ చెయ్యలేదు. ఏపీలో సామాన్యులకు రక్షణ కల్పించలేమని ఇక్కడున్న నాయకులు చెప్తే అప్పుడు సీబీఐ ఎలా పనిచేస్తుందో చూడండి అంటూ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా? : చంద్రబాబునాయుడు