రేపు అల్లూరి సంబంధీకులతో ప్రధాని మోడీ సమావేశం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (10:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం భీమవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బంధువులు, సంబంధీకులతో సమావేశంకానున్నారు. ఈ మేరకు అల్లూరి సోదరుడు, సోదరి మనవలు, అల్లూరి సైన్యంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులకు చెందిన మనవలు, మునిమనవళ్ళు ఇలా మొత్తం 37 మంది అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఎంపిక చేసింది. వీరిందరినీ ప్రధాని మోడీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమవుతారు. 
 
నిజానికి వీరిందరినీ ప్రధాని మోడీ ఆశీనులయ్యే సభా వేదికపైనే కూర్చోబెట్టాలని తొలుత భావించారు. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత  వీరందరితో ఒక సమావేశమందిరంలో భేటీ అవుతారు. 
 
మరోవైపు, ఈ సందర్భంగా జరిగే కార్యక్రమ వేదికపై ప్రధాని మోడీ, గవర్నర్ హరిచందన్, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి ఆర్కే.రోజా, టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సిట్టింగ్ ఎంపీ రఘురామరాజు తదితరులు వేదికను అలంకరిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల ఎత్తులో స్థాపించిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments