Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టంగుటూరి ప్రకాశం వర్థంతి: ఆరుపైసలకు కిలోబియ్యం.. కేసు గెలిచి రూ.70వేలు

Advertiesment
Tangutoori
, గురువారం, 19 మే 2022 (12:21 IST)
Tangutoori
బహుముఖ ప్రజ్ఞాశాలి టంగుటూరి నన సందర్భంగా ఆయనను స్మరించుకుందాం. ప్రకాశం జిల్లాలోని వినోదరాయుని పాలెంలో సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించిన టంగుటూరి ప్రకాశం పంతులు.. 1872/ఆగస్టు /23 వతేదిన జన్మించారు.  
 
ప్రకాశం వారు తన పదకొండవ ఏటనే తండ్రిని కోల్పోయారు. తల్లి పూటకూళ్ళ(భోజనశాల)నడుపుతున్న గడవని స్ధితి. ధనికుల ఇళ్ళలో ప్రకాశం వారాలకు కుదిరారు. 
 
చదువుతూనే నాటకరంగానికి సేవలు అందించేవారు. వల్లూరులో మిషన్ పాఠశాల ఉపాధ్యాయులు ఇమ్మినేని హనుమంతురావు నాయుడు పరిక్ష ఫీజు కట్టడంతో మెట్రిక్ ఉత్తీర్ణత పొందిన అనంతరం ప్రకాశం వారిని రాజమండ్రి తీసుకువెళ్ళి ఎఫ్.ఏ.చదివించారు.
 
అనంతరం మద్రాసు 'లా'కాలేజిలో చేరి ఉత్తీర్ణులైనారు. తన అక్కకూతురు హనుమాయమ్మను అద్దంకిలో వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి తల్లి మరణించారు. ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి, 1894లో రాజమండ్రి చేరి డబ్బు,పేరు బాగా సంపాదించారు.
 
1940లోఇంగ్లాండ్ వెళ్ళి 'బారిష్టర్' చదువు పూర్తి చేసుకుని వచ్చి 1901లో మద్రాసు హైకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా పేరు పొందారు. ఆరుపైసలకు కిలోబియ్యం అమ్మేరోజుల్లో ఓ కేసు గెలిచి 70 వేలరూపాయల ఫీజుపొందారు. 
 
హాలెండ్, డెన్మార్క్, స్వీడన్, ఇటలీ, జర్మనీ వంటి పలుదేశాలు సందర్శించారు. రాజకీయాలపై ఆసక్తితో తన 35వ ఏట 1903 లో రాజమండ్రి మునిసిపల్ ఛైర్మెన్‌గా ఎన్నిక అయ్యారు. 
 
1921లో గాంధీజీ పిలుపుకు స్పందించి నెహ్రూ గారితో కలసి జనవరి 24 న కోర్టులు బహిష్కరించారు ప్రకాశం. ఆ సంవత్సరమే 'స్వరాజ్యం'అనే ఆంగ్ల దినపత్రిక ప్రారంభించారు. 
 
ఈపత్రిక మూడుభాషల్లో 14 ఏళ్ళు నడచింది. 1926 శాసనసభకు ఎన్నికై నాలుగేళ్ళు సేవలు అందించారు.
 
1930 లోజరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గోని చెరసాల శిక్ష అనుభవించారు. 
1937లో మద్రాసు రాష్ట్ర మంత్రి మండలిలో రెవిన్యూ మంత్రిగా పనిచేసారు. 
1941 వ్యక్తి సత్యాగ్రహం. 
1942 లో 'క్విట్ ఇండియా'ఉద్యమాలలో పాల్గేని చెరసాల శిక్ష అనుభవించారు.
 
ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు మద్రాసులో 13నెలలు ముఖ్యమంత్రిగా, రాష్ట్రం ఏర్పడిన తరువాత కర్నూలులో ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరి పరిపాలనా కాలంలోనే తిరుపతిలో శ్రీవెంకటేశ్వరా విశ్వవిద్యాలయం ఏర్పడింది. తెన్నేటి విశ్వనాధం వారి సహాకారంతో జమిందారి వ్యవస్ధ నిర్మూలనకు ఆరు వేల పేజిల రిపోర్టు తయారు చేసారు.
 
ఒంగోలు జిల్లాగా ఏర్పడినపుడు దానికి వీరి పేరున'ప్రకాశం'జిల్లాగా మార్చారు తన 84వ ఏట హైదరాబాద్ వెళుతూ వడదెబ్బకు లోనై ఈ ధన్యజీవి 1957-మే-20 వ తేదిన తుది శ్వాస విడిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టిన రోజు నాడే ఆమెకు చివరి రోజు.. రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతూ..?