Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఠాగూర్
శుక్రవారం, 20 జూన్ 2025 (14:35 IST)
హీరోలు సినిమాల్లో చెప్పే డైలాగులు థియేటర్లకే బాగుంటాయని, బాహ్య ప్రపంచంలో వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యంకాదని సినీ హీరో, జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అప్రజాస్వామిక ధోరణితో మాట్లాడే వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలన్నారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. 
 
ఈ సందర్భంగా జగన్ సినిమా డైలాగులు చెబుతూ చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని, వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘీక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందేనన్నారు. 
 
దీనిపై పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని హెచ్చరించారు. రౌడీషీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామన్నారు. చట్టవిరుద్దంగా ప్రవర్తించేవారిని, బహిరంగంగా ప్రదర్శలు చేసేవారిని కట్టడి చేయాలని, కట్టడి చేయకపోగా సమర్థించేలా మాట్లాడేవారి నేర ఆలోచనను ప్రజలంతా గమనించాలని కోరారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అనే విషయాన్ని మరిచిపోవద్దని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments