అనుమానంలేదు... ఆపరేషన్ గరుడే... పవన్-జగన్ కలిసి...

తాజాగా దేశంలో వెలువడిన నాలుగు ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. భాజపా వ్యవహార శైలి చూస్తుంటే, నటుడు శివాజీ చెప్పినట్లే ఆపరేషన్ గరుడ ప్లాన్ చేసిందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డిత

Webdunia
గురువారం, 31 మే 2018 (19:32 IST)
తాజాగా దేశంలో వెలువడిన నాలుగు ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. భాజపా వ్యవహార శైలి చూస్తుంటే, నటుడు శివాజీ చెప్పినట్లే ఆపరేషన్ గరుడ ప్లాన్ చేసిందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డితో లాలూచీ రాజకీయాలు చేస్తూ, ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. 
 
ఇవే కాకుండా ఐవైఆర్ కృష్ణారావుతో పుస్తకాలు, రమణ దీక్షితులతో ఆరోపణలు వంటివన్నీ చూస్తే ఆపరేషన్ గరుడ నిజమేనన్న భావన కలుగుతోందన్నారు. ఐతే భాజపా ఆపరేషన్లు రివర్సవుతున్నాయనీ, అవన్నీ వాళ్లకే తగులుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. కర్నాటకలో ప్రారంభమైన భాజపా పతనం 2019 నాటికి పూర్తిగా ముగుస్తుందని జోస్యం చెప్పారు. 
 
ఒకవైపు ఏ ఎన్నిక జరిగినా భాజపా ఘోరంగా పరాజయాలను చవిచూస్తుంటే వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవాలన్న బుద్ధి కూడా వారికి రావడం లేదని విమర్శించారు యనమల. తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి వైదొలగిన నాటి నుంచి తమ పార్టీపై భాజపా కక్ష పెంచుకుని నిధులు విడుదల చేయడం లేదంటూ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments