Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై హత్యాచారం.. అత్యాచారానికి పాల్పడి.. నోట్లో బియ్యం పోశారు..

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (14:41 IST)
నిర్భయ, దిశ చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గట్లేదు. వయోబేధాలు లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవరాజుకుంట శివారులో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు నోట్లో బియ్యం కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవరాజుకుంట శివారులో దారుణం జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి అనంతరం నోట్లో బియ్యం గింజలు పోసి హత్యాయత్నం చేశారు. ఆమె చనిపోయిందనుకుని అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళ స్పృహలోకి వస్తే మిస్టరీ వీడిపోయే అవకాశం ఉందనుకున్నారు పోలీసులు. కానీ బాధితురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ కేసును చేధించడం మిస్టరీగా మారింది. ఈ సంఘటనలో ప్రాధమిక ఆధారాలను గుర్తించిన పోలీసులు మహిళపై అత్యాచారంచేసి అనంతరం హత్యాయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నారు.  నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలు ఒంగోలు శ్రీనగర్ కాలనీకి చెందిన పోలమ్మగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments