అపస్మారక స్థితిలో మహిళ.. పక్కన పది కండోమ్‌లు

బుధవారం, 22 జనవరి 2020 (16:51 IST)
సమాజంలో ఆడవారికి రక్షణ రోజురోజుకీ కరువైపోతోంది. ఆడది ఒంటరిగా రోడ్డు మీదకు వెళ్లి క్షేమంగా ఇంటికి చేరడమే గగనమైపోతోంది. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన  చట్టాలు తీసుకువస్తున్నా నేరం చేయాలనే ఆలోచన వచ్చిన వారిని మాత్రం ఆపలేకపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు, మహిళలు మృగాళ్ల బారిన పడ్డారు. కొందరు బాధితులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు జీవచ్ఛవాలుగా బతుకులీడుస్తున్నారు. తాజాగా ఒంగోలులో ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది.
 
ఒంగోలులోని కేశవరాజు కుంట శివారులో బుధవారం ఉదయం దారుణ దృశ్యాలు వెలుగు చూశాయి. ఓ గుర్తు తెలియని మహిళ వివస్త్రగా పడి ఉంది. ఉదయాన్నే పనుల మీద వెళ్తున్న కొందరు స్థానికులు ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సదరు మహిళ ఒంటిపై దుస్తులు లేవు. ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. 
 
ఆ పక్కనే మహిళ దుస్తులు, నల్లపూసల దండ, కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. దీంతో మహిళపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సదరు మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళ  ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జగన్ రెడ్డికి ఎర్త్ పెట్టిన ప్రధాని మోదీ.. ఆ ప్రాంతానికి ఒక్కటే రాజధాని..?