బాయ్‌ఫ్రెండ్‌పై దాడి చేసి యువతిపై అఘాయిత్యం.. మరోచోట భర్తే ఆ పని చేశాడు..?

సోమవారం, 20 జనవరి 2020 (15:20 IST)
దేశంలో మహిళలకు భద్రత కరువైంది. నిర్భయ, దిశ తరహా ఘటనలు జరుగుతూనే వున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు ఆగట్లేదు. తాజాగా తమిళనాడులోని వెల్లూరులో దారుణం చోటుచేసుకుంది.  24 ఏళ్ల యువతిని ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. నిందితులు బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌పై దాడి చేసి.. ఆమెకు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇంకా వారి వద్ద వున్న డబ్బును, వస్తువులను దోచుకెళ్లారు. వేలూరు కోట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో 18 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరొకరి కోసం గాలిస్తున్నారు.
 
మరోవైపు ఒడిశాలో కూడా కామాంధులు రెచ్చిపోయాయి. ఓ మహిళపై.. ఆమె భర్త తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్యభర్త కలిసి వెకేషన్‌ కోసం బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
భార్యను వెకేషన్‌కంటూ ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లి.. అక్కడ అతడి స్నేహితులు ముగ్గురితో అత్యాచారానికి పాల్పడేలా చేశాడు. ఆ తర్వాత ఆమె భర్త కూడా అదే పని చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జగన్‌కు అహం తలకెక్కింది.. రోజాకు అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదా?