మైసూరు నగర మేయర్‌గా మొదటిసారి ముస్లిం మహిళ

మంగళవారం, 21 జనవరి 2020 (10:40 IST)
మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా తొలిసారి ఓ ముస్లిం మహిళ ఎన్నికయ్యారు. జనతా దళ్ సెక్యూలర్ పార్టీకి చెందిన తస్నీమ్ (34) అనే మహిళ మైసూర్ 22వ మేయర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె మైసూర్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు కొర్పొరేటర్‌గా గెలుపొందారు. 
 
కాగా కార్పొరేటర్‌గా ఆమె గెలుపొందడం ఇది రెండవసారి. ఇక మైసూర్ మేయర్ బరిలో తస్నీమ్‌కు పోటీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గీతా యోగానంద పోటీ చేశారు. మొత్తం 70 మంది సభ్యులు ఉండగా, 47 మంది తస్నీమ్‌కు మద్దతు తెలిపారు. బీజేపీ అభ్యర్థికి కేవలం 23 ఓట్లే వచ్చాయి. దీంతో జెడిఎస్ పార్టీ మైసూర్ మేయర్ పీఠంపై తన జెండా ఎగురవేసింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాజధాని వికేంద్రీకరణ వైసీపీ వినాశనానికి పునాది : పవన్ కళ్యాణ్