Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతుల రిలే దీక్షపై వైకాపా శ్రేణుల దాడి

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (14:17 IST)
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజధాని తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు రిలే దీక్ష శిబిరంపై అధికార వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. అంతేకాకుండా, రిలే నిరాహారదీక్షకు కూడా నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 
 
అలాగే, రిలే దీక్షలో కూర్చొన్న వారిపై కోడిగుడ్లు, టమాటాలతో వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీక్ష శిబిరం ఎదుట వైసీపీ నేతలు బైక్‌లతో చక్కర్లు కొడుతున్నారు. శిబిరం ఎదుటే చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసి అలజడి సృష్టించారు.
 
శిబిరం ఎదుట మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేసి రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో... ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా తోపులాటకు దారి తీయడంతో... పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకూ నచ్చజెప్పి శాంతించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments