యాక్టర్ వెనుక 40 ఇయర్స్ ఇండస్ట్రీ : విజయసాయిరెడ్డి

శుక్రవారం, 17 జనవరి 2020 (16:16 IST)
భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీల మధ్య కుదిరిన పొత్తుపై వైకాపా ఎంపీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. యాక్టర్ వెనుక 40 ఇండస్ట్రీ ఉందంని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ యాక్టర్ నిమిత్తమాత్రుడు మాత్రమే. రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా 40 ఇయర్ ఇండస్ట్రీదేనంటూ పవన్ కళ్యాణ, చంద్రబాబుపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ - జనసేన పార్టీలు కలిసి నడవాలని ఆ పార్టీల అగ్రనేతలు నిర్ణయించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, రాజధాని అమరావతి, ప్రజా సమస్యలపై ఈ రెండు పార్టీలు కలిసి పోరాటం చేయనున్నాయి. ఈ పార్టీల కలయికపై విజయసాయి రెడ్డి తనదైనశైలిలో సెటైర్లు వేశారు. 
 
"యాక్టర్ నిమిత్త మాత్రుడు. నడిపించేది, వెనుక నుంచి నెట్టేది, డైరెక్ట్ చేసేది, స్క్రిప్ట్ చేతి కందించేది, పేమెంట్ ఇచ్చేది యజమాని స్థానంలో ఉన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీనే. కమ్యూనిస్టులతో కలిసినా, బీఎస్పీ కాళ్లు పట్టుకున్నా, కమలం వైపు కదిలినా ఆదేశించేది ఆయనే' అని ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆ వ్యక్తి నెల జీతం ఏడు వేలే.. టాక్స్ మాత్రం రూ.134 కోట్లు కట్టాలట..!