Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు.. హైవే కిల్లర్స్‌కు ఉరిశిక్ష

Webdunia
సోమవారం, 24 మే 2021 (15:14 IST)
ఒంగోలు కుటుంబ కోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. హైవే కిల్లర్ మున్నా కేసులో మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్షను విధించింది. అలాగే, మరో ఆరుగురికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి జి.మనోహర్ రెడ్డి తీర్పు ఇచ్చారు. 
 
ఈ జిల్లాలో గత 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించిన విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో సచలనంగా మారింది. ఈ మున్నా గ్యాంగ్ జాతీయ రహదారిపై 13 మంది డ్రైవర్లు, క్లీనర్లని దారుణంగా హత్య చేసింది. 
 
ఆ విధంగా ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి డ్రైవర్, క్లీనర్లని చంపి లారీలు హైజాక్ చేసేవారు. గత 2008లో ఈ ముఠా పాల్పడిన దారుణాలపై జిల్లాలోని ఒంగోలు తాలుకా, సింగరాయకొండ, మద్దిపాడు పోలీస్‌స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు.  
 
వీటిలో నాలుగు కేసుల్లో మున్నాతో పాటు 18మందిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి ఈనెల 18న వెల్లడించారు. వీరంతా దారిదోపిడీలు, హత్యలకు పాల్పడటంతో పాటుగా అందుకు సంబంధించిన ఆధారాలను రూపుమాపినట్లు, ఆయుధాలు కలిగి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments