Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో హైవేను రెండేళ్ల పాటు దత్తత తీసుకున్న నాట్స్

Advertiesment
అమెరికాలో హైవేను రెండేళ్ల పాటు దత్తత తీసుకున్న నాట్స్
, సోమవారం, 26 ఏప్రియల్ 2021 (23:18 IST)
ఫ్లోరిడా: నాట్స్ సేవ కార్యక్రమాలలో మరో ముందడుగు వేసింది. అమెరికాలో రహదారుల పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రత కూడా ప్రజలు తమ సామాజిక బాధ్యతగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టెంపాబే విభాగం టెంపాలోని రెండు మైళ్ల హైవేను దత్తత తీసుకుంది. దీని ప్రకారం ఈ రెండు మైళ్ల పరిధిలో ఉండే హైవేను పరిశుభ్రత బాధ్యతను నాట్స్ భుజానికెత్తుకుంది.
 
ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ ప్రారంభించారు. 20 మంది నాట్స్ సభ్యులు, స్థానిక ఉండే హైస్కూల్ విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సేవలు అందించారు. రెండు మైళ్ల పాటు రహదారికి ఇరువైపులా ఉన్న చెత్త చెదారం అంతా తొలగించారు. అంతా శుభ్రంగా ఉండేలా చేశారు. ఎర్త్ డే నాడు విద్యార్ధుల్లో కూడా మన పరిసరాలను మనమే బాగు చేసుకోవాలనే స్ఫూర్తిని నింపేందుకు నాట్స్ ఈ కార్యక్రమం చేపట్టింది.
 
ఇందులో పాల్గొన్న విద్యార్ధులకు నాట్స్ సేవా ధ్రువ పత్రాలను అందించింది. నాట్స్ టెంపాబే నాయకత్వం ఎంతో సమర్థంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ నాయకులు శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ ఆరికట్ల, బిందు సుధ, శ్రీనివాస్ అచ్చి, శ్రీనివాస్ బైరెడ్డి, భాస్కర్ సోమంచి, జగదీష్ తౌతం, రమేష్ కొల్లి, సుమంత్ రామినేని, అనిల్ అరేమండ, విజయ్ కట్టా ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు.
 
ఆండ్రెస్ క్వాస్ట్, రోనక్ అగర్వాల్, ఆండీ చెన్, అభయ్ తుంగతుర్తి, సూర్య కార్తికేయన్, విజయలక్ష్మి రిష్విత సి ఆరికట్ల, శ్రీష్ బైరెడ్డి, క్రిష్ తలతి, అంజలి శర్మ, కుషి తలతి తదితరులు రహదారి పరిశుభ్రతలో ఎంతో ఉత్సాహంగా పనిచేశారు.
 
టెంపా బే చాప్టర్ కోసం సర్వీస్ సర్టిఫికేట్ టెంప్లేట్‌ తయారు చేయడంలో సోహన్ మల్లాడి కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమం కోసం నాట్స్ టెంపా బే యూత్ కమిటీ సభ్యులు రుత్విక్ ఆరికట్ల, సోహన్ మల్లాదిలు చూపిన చొరవను నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది. ఈ రహదారికి రెండేళ్ల పాటు పరిశుభ్రత నిర్వహణను నాట్స్ తీసుకుంది కాబట్టి.. ఇది క్రమం తప్పకుండా కొనసాగించనుంది.
 
నాట్స్ ఫ్లోరిడా చాప్టర్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతర నాట్స్ చాఫ్టర్లు కూడ ముందుకు రావడం చాలా సంతోషాన్ని ఇస్తోందని నాట్స్ చైర్మన్ శ్రీదర్ అప్పసాని, అధ్యక్షుడు శేఖర్ అన్నే ఫ్లోరిడా చాప్టర్ నాయకత్వాన్ని అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బత్తాయిరసంలో అల్లం, జీలకర్ర పొడి వేసుకుని తాగితే?