Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీన్ రివర్స్... ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి ధర్నా

Webdunia
బుధవారం, 10 జులై 2019 (16:11 IST)
ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ధర్నాలు చేయడం మనం రోజూ చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ప్రియురాలు మోసం చేసిందంటూ ప్రియుడు ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగడం హాట్‌టాపిక్‌గా మారింది. 
 
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్‌లో జరిగిన ఈ సీన్ హాట్‌టాపిక్‌గా మారింది. బుధవారం ఓ యువకుడు ఉన్నట్టుండి తన ప్రియురాలి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే ఆరు బయట కూర్చొని నిరసనకు దిగాడు. ఈ సీన్ చూసిన స్థానికులంతా అక్కడ గుమ్మిగూడారు. 
 
ఏం జరిగిందని అందరూ ఆరా తీస్తే జరిగిన స్టోరీని చెప్పుకొచ్చాడు. స్థానిక యువతి తనను ప్రేమించిందని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత మొహం చాటేసిందని యువకుడు చెప్పాడు. ఆమెతో దిగిన ఫోటోలను కూడా వారికి చూపించాడు. తాను మోసపోయానంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఇదంతా చూసిన స్థానికులు షాకయ్యారు. 
 
దీంతో పరువు పోతుందని భావించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ప్రేమ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. అయితే వారిద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments