Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడు కోసం దొంగగా మారిన ప్రియురాలు... ప్రియుడు ఏం చేశాడో తెలుసా?

Advertiesment
ప్రియుడు కోసం దొంగగా మారిన ప్రియురాలు... ప్రియుడు ఏం చేశాడో తెలుసా?
, బుధవారం, 3 జులై 2019 (17:39 IST)
ఎం.ఫార్మసీ చదువుతోంది. ట్విట్టర్, ఫేస్ బుక్‌లను బాగా ఫాలో అవుతుంది. అందంగా ఉన్న అబ్బాయిలంటే చాలా ఇష్టం. వారితో స్నేహం చేయాలనుకుంటుంది. అలా ఒక యువకుడితో స్నేహం ఏర్పరచుకుని చివరకు ప్రియురాలుగా వున్న ఆమె కాస్తా దొంగగా మారాల్సిన పరిస్థితి వచ్చింది.
 
నల్గొండ జిల్లాకు చెందిన సతీష్ అమ్మాయిలకు వలవేయడం తన ఆర్థిక అసరాలను తీర్చుకోవడం అలవాటు. ఇలా ఒకరిద్దరు కాదు 15 మందికి పైగా యువతులు ఇతన్ని నమ్మి మోసపోయినవారే. సూర్యాపేటకు  చెందిన ఒక యువతి ఫేస్ బుక్ ద్వారా సతీష్‌కు దగ్గరైంది.
 
మూడు నెలల పాటు వీరి స్నేహం సాఫీగానే సాగింది. అయితే సతీష్ తనకు డబ్బులు కావాలని.. తన స్నేహితుడి దగ్గర గతంలో అప్పు తీసుకున్నానని.. అతనికి అప్పు చెల్లించేంత డబ్బు తనవద్ద లేదని చెప్పుకొచ్చాడు.
 
తన ప్రియుడు పడుతున్న ఆవేదన చూసి తట్టికోలేకపోయింది ప్రియురాలు. ఎలాగైనా డబ్బులు తెచ్చివ్వాలని ప్లాన్ చేసింది. తన ఇంట్లోనే నగలు, నగదును దొంగతనం చేద్దామని ప్లాన్ చేసింది. అనుకున్న విధంగానే మూడు లక్షల వరకు సర్దేసి మొత్తం ప్రియుడికి ఇచ్చేసింది.
 
ఇంట్లో వారికి అనుమానం రాకూడదని రాత్రి నిద్రపోయాక దొంగ వచ్చి తనను బెదిరించి నగలు, నగదు ఎచ్తికెళ్ళాడని చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి పొంతనలేని మాటలు చెబుతుండటంతో అనుమానంతో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. సతీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నత్తనడకన కాదు.. శరవేగంగా పూర్తి చేయాలి : మంత్రి వెల్లంపల్లి