నత్తనడకన కాదు.. శరవేగంగా పూర్తి చేయాలి : మంత్రి వెల్లంపల్లి

బుధవారం, 3 జులై 2019 (17:21 IST)
నియోజకవర్గంలో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని, పక్కా రోడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చెయ్యాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బుదవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గంలో నగర పాలక సంస్థ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి మంత్రి వెలంపల్లి పర్యటించారు. 
 
ఈ సందర్భగా స్థానికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా రహదారులు గోతులతో అధ్వానంగా ఉన్నాయని వాహనదారులేకాక పాదాచారులు కూడా నడిచే పరిస్థితి లేదన్నారు. ముఖ్యంగా రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్ వద్ద నుంచి అర్ అప్పారావు వీధి, పార్క్ రోడ్, పోతిన ప్రకాష్ మార్కెట్ రోడ్ వెంటనే పక్కా రహదారుల నిర్మాణం చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. నియోజక వర్గంలోని సైడ్ కాలువలు, మెయిన్ డ్రైన్‌లలో మురుగు పుడికలను వెంటనే తొలగించాలన్నారు. 
 
ఒకటో పట్టణం, నైజాం గేట్, ఊర్మిళ నగర్ తదితర ప్రాంతాల్లో రెయిన్ వాటర్ డైవర్షన్ పనులు అసంపూర్తి గా ఉన్నాయని వీటిని తరితగతిన పూర్తి చేయాలన్నారు. రోటరీ నగర్ నుంచి కబెళా మీదుగా రామరాజ్య నగర్ తదితర ప్రాంతాల్లో ముంపుకు గురికాకుండా వర్షపు నీరు పారుదలకు అనుగుణంగా కాలువలను వెడల్పు చేసే పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజలు మానసిక శారీరక వికాసానికి నిలయమైన గాంధీ పార్క్ వంటి పార్క్ స్థలాల్లో అవసరమైన చిన్నారులు ఆడుకునే అట వస్తువులతో పాటు జిమ్‌కు అవసరమైన సామాగ్రిని సమకూర్చాలని నగర పాలక సంస్థ అధికారులకు ఆదేశించారు. 
 
బెలా సెంటర్‌లో ఉన్న ఉర్దూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌ను వించి పేటలో ఉన్న ఉర్దూ స్కూల్‌లో కాలి భవనం‌లోకి మార్పు చెయ్యాలని విద్యార్థుల తల్లదండ్రులు కోరికను పరిశీలిస్తామన్నారు. పర్యటనలో బాగంగా ఉర్దూ స్కూల్, కాలేజ్‌ను సందర్శించిన మంత్రి ఉర్దూ స్కూల్‌కు కావలసినమౌలిక సదుపాయాలను ఎర్పాటు చెయ్యాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నారా లోకేష్ దానికి పనికిరాడు: వైసిపి కార్యకర్త సంచలన వ్యాఖ్యలు