Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జస్ట్ దానిపై ఒక్క క్లిక్ చేస్తే చాలు... మహిళల దుస్తులు ఔట్.... నగ్నంగా...

Advertiesment
జస్ట్ దానిపై ఒక్క క్లిక్ చేస్తే చాలు... మహిళల దుస్తులు ఔట్.... నగ్నంగా...
, సోమవారం, 1 జులై 2019 (12:27 IST)
యువతను పెడదోవ పట్టించే యాప్‌లు ఇంటర్నెట్ ప్రపంచంలో విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఎన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నా వాటిని ఆపలేకపోతున్నారు. పోర్న్ వెబ్‌సైట్లు గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు దీన్ని మించిన మరో అప్లికేషన్ దూసుకువచ్చి కలవరపెడుతోంది. దీనిపేరు ‘డీప్ న్యూడ్’. 

ఈ యాప్‌తో ఫొటోల్లో ఉండే మహిళలను ఒక్క క్లిక్‌తో నగ్నంగా మార్చేయవచ్చు. ఈ యాప్‌ను అలా పరిచయం చేశారో లేదో వందలాది స్త్రీల ఫోటోలను న్యూడ్ గా మార్చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు కొందరు. దీనితో సదరు సంస్థపై తీవ్రమైన నిరసనలు వ్యక్తం కావడంతో దాన్ని ఆన్ లైన్ నుంచి తొలగించేశారు.
 
వివరాల్లోకి వెళితే... యూరప్‌లోని ఎస్టోనియాకు చెందిన ఓ సంస్థ డీప్ న్యూడ్ అనే అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏఐ టెక్నాలజీ ద్వారా దుస్తులను తొలగించే ఈ యాప్‌ను భారీ సంఖ్యలో నెటిజన్లు డౌన్లోడ్ చేసుకోవడం, అమ్మాయిల ఫొటోలను విచ్చలవిడిగా నగ్నంగా మార్చేయడం జరిగిపోయింది.

అంతేకాదు... హాలీవుడ్ హీరోయిన్ల ఫోటోలను సైతం నగ్నంగా మార్చేసి నెట్లో పెట్టి గందరగోళం సృష్టించారు. ఈ ఫోటోలను చూసిన సదరు సెలబ్రిటీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనితో సదరు సంస్థ తోక ముడిచింది. ఇక భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లు ఎవరు తెచ్చినా కఠినమైన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
 
ఐతే... సోషల్ మీడియాలో యువతులు ఫోటోలను పెట్టడం ఎంత ప్రమాదకరమో ఈ యాప్ ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఇబ్బడిముబ్బడిగా ఫోటోలను షేర్ చేయడం వల్ల కొన్ని యాప్‌లతో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సునీతా సింగ్ గోర్ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం మహిళల ఇంట్లోకి దూరి..?