Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూగుల్ పే, అమేజాన్ 'పే'లకు ఆర్బీఐ షాక్.. 24 గంటల్లోపు ఆ పని చేయకపోతే?

Advertiesment
RBI
, శుక్రవారం, 28 జూన్ 2019 (12:17 IST)
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గూగుల్ పే, అమేజాన్ పేలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. గూగుల్ పే, అమేజాన్ పే వంటి సంస్థలు విదేశాల్లో వుండే సర్వర్‌ల ద్వారానే భారతీయ నగదు బదిలీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నాయని ఆర్బీఐ పేర్కొంది.


అందుచేత ఇకపై విదేశాల్లోని సర్వర్ల ద్వారా నగదు బదిలీలకు సంబంధించిన వివరాలను సేకరించడం లేదంటే భద్రపరచటం వంటివి చేయకూడదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. 
 
భారత్‌లో జరిగే మనీ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన డేటాను స్వదేశీ సర్వర్ల ఆధారంగానే సేవ్ చేయాలి. అలాకాకుండా విదేశీ సర్వర్ల ఆధారంగా భారతీయ నగదు బదిలీలకు సంబంధించిన సమాచారం భద్రపరచడం చేస్తే ఇక చర్యలు తప్పవని ఆర్బీఐ హెచ్చరించింది. 
 
ఇంకా భారత దేశంలో సర్వర్లు లేని గూగుల్ పే, అమేజాన్ పే వంటి సంస్థలు త్వరలో వాటిని ఏర్పాటు చేసుకోవాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఈ వ్యవహారంపై గూగుల్ పే, అమేజాన్ పే సంస్థలు 24 గంటల్లోపు నిర్ణయం తీసుకుని వివరణ ఇవ్వాలని ఆర్బీఐ అల్టిమేటం జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేయసిని పలుమార్లు లొంగదీసుకున్నాడు.. గర్భం దాల్చేసరికి చేతులెత్తేశాడు.. చివరికి?