Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.600లకే ఇంటర్నెట్, టీవీ, ల్యాండ్‌లైన్.. జియో గిగా ఫైబర్ ఆఫర్

Advertiesment
రూ.600లకే ఇంటర్నెట్, టీవీ, ల్యాండ్‌లైన్.. జియో గిగా ఫైబర్ ఆఫర్
, బుధవారం, 26 జూన్ 2019 (12:26 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో.. మిగిలిన టెలికాం రంగాలకు చెందిన సంస్థల్ని గట్టిదెబ్బ కొట్టింది. కేవలం రూ.600లకే ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు చుక్కలు చూపించింది. రూ.600లకే ఇంటర్నెట్, ల్యాండ్ లైన్, టీవీ సెటాప్ బాక్సులను అందించే ఆఫర్‌ను జియో ప్రవేశపెట్టడం ద్వారా మిగిలిన టెలికాం రంగ సంస్థలకు కళ్లు బయర్లు కమ్మాయి. 

గత 2018వ సంవత్సరం నుంచి జియో గిగా ఫైబర్ సేవలు ప్రారంభమయ్యాయి. జియో గిగా ఫైబర్ ఆఫర్‌ను పొందాలంటే ముందుగా రూ.4,500లను డిపాజిట్‌గా చెల్లించాలి. ఆపై చెల్లించే నెలసరి చెల్లింపుకు తగినట్లు ఇంటర్నెట్ సేవలను అందిస్తారు. అయితే ప్రస్తుతం జియో సంస్థ రూ.600లకే ఇంటర్నెట్, ల్యాండ్ లైన్, టీవీ సెటాప్ బాక్స్ సేవలను అందించనుంది.
webdunia
అంతేగాకుండా రూ.1,000లను అదనంగా చెల్లిస్తే.. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ అనే 40 గ్యాడ్జెట్లను పొందవచ్చు. జియో నుంచి లభించే ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులకు భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. కానీ ఇతర టెలికాం సంస్థలకు మాత్రం జియో ఆఫర్ కాస్త గుదిబండలా మారింది. దీంతో ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి సంస్థలకు షాక్ తగిలింది. ఫలితంగా తమ వినియోగదారులను కాపాడుకునేందుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలు మల్లాగుల్లాలు పడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను భయపెట్టే పాత్రలే చేస్తాను... అదే నాకిష్టం అంటున్న సమంత