Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొట్టికొట్టి ఓపిక నశించే కాళ్లు కట్టేసి, నోట్లో ప్లాస్టిక్‌ కవర్లు కుక్కాడు.. బ్యూటీషియన్ పద్మ

బ్యూటీషియన్ పద్మ హత్యాయత్నం కేసులోని మిస్టరీ ఇపుడిపుడే వీడుతోంది. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఇపుడిపుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం పోలీసులు ఆమె వద్ద కొద్దిసేపు విచారణ జరిపారు. ఈ

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (08:47 IST)
బ్యూటీషియన్ పద్మ హత్యాయత్నం కేసులోని మిస్టరీ ఇపుడిపుడే వీడుతోంది. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఇపుడిపుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం పోలీసులు ఆమె వద్ద కొద్దిసేపు విచారణ జరిపారు. ఈ విచారణలో ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
 
ఈ నెల 23వ తేదీ రాత్రి జరిగిన తీవ్ర వివాదంలో పద్మను నూతన్ కుమార్‌ విచక్షణ రహితంగా కొట్టినట్లు పోలీసులకు తెలిపింది. దీంతో తన కుమార్తెకు కూడా ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు ఫోన్ చేసి చెప్పినట్టు ఆమె మొదటి భర్త సూర్యనారాయణ కూడా మీడియాకు తెలిపాడు. 
 
అదేసమయంలో పద్మపై జరిగిన హత్యాయత్నంలో నూతన్ కుమార్‌ ఒక్కడే ఉన్నాడని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకూ హత్యాయత్నం ఘటనలో సుబ్బయ్య అనే మూడో వ్యక్తి ఉన్నట్లు వచ్చి ఊహాగానాలకు తెరపడింది. 
 
తొలుత నూతన్ కుమార్‌ తీవ్రంగా కొట్టిన దెబ్బలతో ఓపిక పూర్తిగా నశించిందని, ఆ తర్వాతే తన కాళ్లు కట్టేసి, నోట్లో ప్లాస్టిక్‌ కవర్లు కుక్కి కత్తితో దాడి చేశాడని ఆమె పేర్కొంది. సోమవారం పద్మ రెండు చేతులకు శస్త్రచికిత్సలు చేయటం, ఆపరేషన్‌ నిమిత్తం అనస్తీషియా ఇవ్వటంతో మత్తుతో ఉందని, నూతన్ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మంగళవారం కుటుంబ సభ్యులు పద్మకు చెప్పారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments