Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యూటీషియన్‌ పద్మ కేసులో ట్విస్ట్.. నుదిటిపై 'ఎస్' మార్కు...

రాజమండ్రి హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన బ్యూటీషియన్‌ పద్మ హత్యాయత్నం కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్యాయత్నానికి గురైన బ్యూటీషియన్ పద్మ నుదిటిపై 'ఎస్‌' మార్కులో కత్తితో కోసినట్టుగా కనిపి

Advertiesment
beautician Padma case
, సోమవారం, 27 ఆగస్టు 2018 (12:27 IST)
రాజమండ్రి హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన బ్యూటీషియన్‌ పద్మ హత్యాయత్నం కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్యాయత్నానికి గురైన బ్యూటీషియన్ పద్మ నుదిటిపై 'ఎస్‌' మార్కులో కత్తితో కోసినట్టుగా కనిపించడంతో పోలీసుల ఆ దిశగా విచారణ చేపట్టారు. పద్మ భర్త పేరు కూడా సూర్యనారాయణ ఎస్‌ అక్షరంతో ఉండడంతో పోలీసులు మరో కోణంలో విచారిస్తున్నారు.
 
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన బత్తుల నూతన్‌ కుమార్‌ (42) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం గుంటూరు జిల్లా నరసారావుపేట సమీపంలోని నుదురుపాడు రైల్వేస్టేషన్‌ వద్ద నూతన కుమార్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాధితురాలు పల్లి పద్మ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.
 
ఏలూరులోని వెన్నవెల్లివారి పేటకు చెందిన నూతన కుమార్ తండ్రి ఆర్మీ ఉద్యోగి, తల్లి వీడీవో. వీరిద్దరూ ఇపుడు జీవించిలేరు. చెల్లి, అన్నయ్య ఉన్నారు. తల్లి అనారోగ్యానికి గురైనపుడు అన్నను మోసం చేసి ఉమ్మడిగా ఉన్న ఇంటిని తన పేరున రాయించుకొన్నాడు. ఆ స్థలాన్ని రెండు సంవత్సరాల క్రితం అమ్మగా వచ్చిన రూ.36 లక్షల్లో కొంత సొమ్ము స్నేహితులకు వడ్డీలకు ఇచ్చాడు. గతంలో ఏలూరులో ఒక బ్యూటీషియన్‌తో సంబంధం పెట్టుకుని, ఆమె చేత ఆమె భర్తపై వేధింపులు కేసు పెట్టించినట్లు తెలిసింది.
 
నూతన్‌ కుమార్‌ ఏలూరులోని హుండాయ్‌ షోరూంలో మేనేజర్‌గా పనిచేసినపుడు, అక్కడ పద్మ పరిచయమైంది. ఆ పరిచయం వీరి మధ్య సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఆమె భర్త సూర్యనారాయణకు తెలియడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. పద్మతో సంబంధం విషయం నూతన్‌ కుమార్‌ భార్యకు తెలియడంతో ఆమె గొడవపడి దూరంగా ఉంటోంది. 
 
పద్మకు యుక్తవయస్సు ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో వ్యవహారం పిల్లల మీద పడకూడదని పద్మను ఆమె భర్త దూరంగా పెట్టాడు. దీంతో ఈనెల 6న బాపులపాడులో షేక్‌ పరిషా అనేవ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకొని భార్యభర్తలని చెప్పి కాపురం పెట్టారు. ఆ తర్వాత పద్మ అత్యాచారానికి గురై, హత్యాయత్నానికి గురైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమిస్తున్నానని ఓ యువతితో సహజీవనం.. ఆమె స్నేహితురాలిని కూడా?