Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యంతో జ్యోతుల నెహ్రూ : వైకాపా ఎంపీ వీడియో కాల్

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (15:27 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పలువురు నేతలు, ప్రముఖులు పరామర్శిస్తున్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ నేతలు కూడా ఉన్నారు. 
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నెహ్రూను మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డిలు పరామర్శించారు. అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఆయనకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. 
 
ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా చాలా మంది టీడీపీ నేతలు ఆస్పత్రికి వెళ్లి నెహ్రూను పరామర్శించారు. అయితే.. ఆయన వద్దకు వైఎస్సార్ సీపీ నేతలు చర్చనీయంగా మారింది. 
 
కాగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం జ్యోతుల నెహ్రూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నెహ్రూ ఆరోగ్య పరిస్థితిపై అధినేత చంద్రబాబు ఆరా తీశారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments