Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్‌‌పై భారీ తగ్గింపు.. రూ.37,999కే పొందవచ్చు

Advertiesment
iPhone XR
, సోమవారం, 9 ఆగస్టు 2021 (15:48 IST)
iPhone XR
బిగ్ సేవింగ్ డేస్‌లో యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్‌పై భారీ తగ్గింపును అందించారు. ఈ ఫోన్ రూ.38,999కే ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. ఇంత తక్కువ ధరకు ఈ ఫోన్ ఇప్పటివరకు సేల్‌కు రాలేదు. దీంతోపాటు యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ.1,000 అదనపు తగ్గింపు కూడా లభించనుంది.

అంటే రూ.37,999కే ఈ ఫోన్ కొనవచ్చన్న మాట. దీంతోపాటు ఎక్స్ చేంజ్‌పై ఈ ఫోన్‌కు రూ.15 వేల వరకు అందిస్తామని ఫ్లిప్ కార్ట్ అంటోంది కానీ హైఎండ్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే అంత డిస్కౌంట్ లభిస్తుంది. 
 
కాబట్టి మనం ఉపయోగించే సాధారణ స్మార్ట్ ఫోన్ ఎక్స్‌చేంజ్ పెడితే రూ.6-7 వేల వరకుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.30 వేలలోపుకు తగ్గనుంది. కాస్త హైఎండ్ ఫోన్ అయినా ఎక్స్ చేంజ్ పెడతాం అనుకుంటే రూ.25 వేలలోపు ధరకే ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఈ ఫోన్‌పై ఈ ఎంఐ ఆఫర్లు రూ.1,333 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో 6.1 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 828x1792 పిక్సెల్స్ గా ఉంది.
 
ఈ డిస్‌ప్లేలో ట్రూటోన్, వైడ్ కలర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను కంపెనీ అందించింది. ఏ12 బయోనిక్ చిప్‌ను యాపిల్ ఇందులో అందించింది. దీంతో ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
 
ఎల్ఈడీ ట్రూటోన్ ఫ్లాష్, స్లో సింక్ వంటి టాప్ క్లాస్ కెమెరా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 7 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 
 
ఇందులో ఫీచర్‌ను యాపిల్ అందించింది. ఐఫోన్ ఎస్ఈ 2020 పొడవు 15.09 సెంటీమీటర్లుగా ఉండగా, వెడల్పు 7.57 సెంటీమీటర్లుగానూ, మందం 0.83 సెంటీమీటర్లుగానూ ఉంది. దీని బరువు కూడా 194 గ్రాములు మాత్రమే ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియాలోనే ఉత్తమ ఎయిర్‌పోర్టు ఏది?