Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు సుప్రీం కోర్టు ఎదురుదెబ్బ

అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు సుప్రీం కోర్టు ఎదురుదెబ్బ
, సోమవారం, 9 ఆగస్టు 2021 (15:34 IST)
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు కొన్ని అసంబద్ధ విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఢిల్లీ వ్యాపార మహాసంఘం సీసీఐకి ఫిర్యాదు చేసింది. ఆ రెండు కంపెనీలు మార్కెట్‌ పోటీతత్వ చట్టాలను ఉల్లంఘిస్తూ.. కొంతమంది విక్రేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ లాంచింగ్ లాంటి వాటిని ఈ సందర్భంగా వ్యాపార మహాసంఘం సీసీఐ దృష్టికి తీసుకొచ్చింది. 
 
ఈ ఫిర్యాదుపై స్పందించిన సీసీఐ.. ఆ రెండు ఈ కామర్స్ కంపెనీల మీద గతేడాది జనవరిలో విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఆరోపణలను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కొట్టిపారేశాయి. సీసీఐ ఎలాంటి రుజువులు లేకుండానే దర్యాప్తు చేపట్టిందని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. అయితే అక్కడ వీటికి ఎదురుదెబ్బ తగిలింది. 
 
ఈ రెండు కంపెనీల పిటిషన్లకు విచారణయోగ్యత లేదంటూ జులై 23న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. వీటి వ్యాపార విధానాలపై విచారణ జరపాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఈ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. తమ అంతర్గత వ్యాపార విధానాలపై సీసీఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) దర్యాప్తును నిలిపివేయాలంటూ ఈ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గో ఆధారిత నైవేద్యం 100 రోజులు పూర్తి