Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోటి రూపాయ‌లివ్వు... లేదంటే కిడ్నాప్! పిన్ని కొడుకే ఇలా!!

కోటి రూపాయ‌లివ్వు... లేదంటే కిడ్నాప్! పిన్ని కొడుకే ఇలా!!
విజయవాడ , బుధవారం, 11 ఆగస్టు 2021 (18:52 IST)
కోటి రూపాయ‌లివ్వు... లేదంటే నీ కూతుర్ని, కొడుకుని చంపేస్తామ‌ని ఫోన్ లో బెదిరించారు. ఇంత‌కీ ఈ ఫోన్ కాల్ చేసింది స్వ‌యానా పిన్ని కొడుడు గ్యాంగే. ఈ కిడ్నాప‌ర్ల బెదిరింపుల‌కు నార్పల ఎరువుల దుకాణం యజమాని లొంగ‌లేదు. చివ‌రికి పోలీసులు ఒక్కొక్క‌రినీ ఇలా ప‌ట్టేశారు.

అనంత‌పురం జిల్లా నార్పల ఎరువుల దుకాణం యజమానిని రూ.కోటి రూపాయిలు డిమాండ్ చేస్తూ, బెదిరించిన కేసులో తాజాగా మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుండీ కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉన్న మొత్తం ఐదుగురి నిందితులను అరెస్టు చేసినట్లయ్యింది. అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి ఆదేశాలతో ఇటుకలపల్లి సి.ఐ విజయ భాస్కర్ గౌడ్ ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో తాజాగా తాడేపల్లి గూడెంకు చెందిన చల్లా మనోజ్ కుమార్, అనంతపురానికి చెందిన షేక్ బాబ్జాన్ అరెస్ట్ అయ్యారు. నార్పల మండల కేంద్రంలో కోనంకి చంద్రశేఖర్ నాయుడు ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక అనోన్ నంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. రూ.కోటి ఇవ్వాలని, లేకపోతే కూతురు, కొడుకుని కిడ్నాప్ చేస్తామని ఫోన్ లో బెదిరించారు.

ఇలా పలు దఫాలు ఫోన్ లో బెదిరించడంతో కడకు నార్పల పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై నార్పల పోలీసులు ఫిబ్ర‌వ‌రి 24న‌ ఉడిముడి వీరవెంకట సుబ్బరాజు, షేక్ బాబావలిలను అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో నిందితుడు మురళీని కూడా అరెస్టు చేశారు. మిగితా ఇద్దరు ప్రధాన నిందితులను కూడా డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి ఆదేశాలతో సి.ఐ విజయభాస్కర్ గౌడ్ , ఎస్సై వెంకట ప్రసాద్ ల ఆధ్వర్యంలో పోలీసులు తాజాగా నాయనపల్లి క్రాస్ వద్ద అరెస్టు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో చల్లా మనోజ్ కుమార్ కీలక నిందితుడు. ఇతను, ఉడిముడి వీర వెంకట సుబ్బరాజు, ఇంకొకరు కలసి గత ఏడాది అనంతపురం ఆదర్శనగర్ కు చెందిన నిర్మలమ్మను హత్య చేశారు. హతురాలు స్వయాన మనోజ్ కు పిన్నమ్మ అవుతుంది. ఆస్తి గొడవలు విషయంలో ఆమెను చంపారు. సదరు కేసులో మనోజ్ కుమార్, ఉడిముడి వీర వెంకట సుబ్బరాజులు అనంతపురం జిల్లా జైలు రిమాండ్ లో ఉన్నారు.

అదే సమయంలో, ఓ హత్యాయత్నం కేసులో షేక్ బాబ్జాన్, పి.డి.ఎస్ రైస్ కేసులో బాబావలీ, మురళీ కూడా మరో కేసులో అదే జైలులో ఉంటున్నారు. ఆ సమయంలో వీరందరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బెయిల్ పై అంతా బయటికొచ్చారు. మళ్లీ అందరూ ఒక చోట చేరి సులువుగా డబ్బు సంపాదించేలా వ్యూహాలు రచించారు. ఇందులో భాగమే నార్పల ఎరువుల దుకాణం యజమాని కోనంకి చంద్రశేఖర్ నాయుడిని డబ్బు కోసం బెదిరించి పోలీసులకు చిక్కారు. ఎరువుల దుకాణం యజమాని కూడా మనోజ్ కుమార్ కు దగ్గర బంధువు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం మత్తులో వేధింపులు.. భర్తను అక్కడి తన్నిన భార్య.. చివరికి ఏమైందంటే?