Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వకవి పట్ల వివక్ష : నోరుజారిన కేంద్ర మంత్రి సుభాష్

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (14:21 IST)
విశ్వకవి, నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్‌పై కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కత్తాలోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీని సందర్శించిన కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్.. విశ్వకవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నల్లగా ఉండటంతో తల్లి సహా కుటుంబంలోని కొంత మంది వివక్ష చూపారన్నారు. నల్లగా ఉండటంతో ఆయనను తమ చేతుల్లోకి తీసుకోలేదన్నారు. 
 
'కుటుంబంలోని మిగతా వారి కంటే ఠాగూర్ నల్లగా ఉండేవారు.. ఇక్కడ రెండు రకాల రంగున్న వ్యక్తులు ఉన్నారు.. పసుపు రంగులో మెరిసిపోయేవారు కొందరు.. ఇంకొందరు ఎరుపు రంగులో ఉండేవారు.. విశ్వకవి రెండో వర్గానికి చెందినవారు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
కుటుంబంలోనే రవీంద్రుడు వివక్షతను ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై మేధావులు, విద్యావేత్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. అటు రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా శాఖ మంత్రి అజ్ఞనానికి ఇది నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
 
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి సుభాష్ సర్కార్‌కు రవీంద్రనాథ్ ఠాగూర్ చరిత్ర తెలియదని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ విమర్శించారు. విశ్వకవి అందమైన మేనిఛాయ ఉన్నవారని అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. ఇది జాత్యహంకార వ్యాఖ్యలని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments