Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసానిని ముందుగా మాకు అప్పగించండి: వాహనంతో జైలు ముందు నరసరావు పేట పోలీసులు

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (13:09 IST)
సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే శ్రీ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నమోదైన కేసులో పోసాని అరెస్టయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉంటున్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే పోసానీపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులో నమోదయ్యాయి. ఆయన అదుపులోకి తీసుకునేందుకు మిగిలిన పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లు జారీచేసేందుకు సిద్ధమవుతున్నారు. 
 
మరోవైపు, గుంటూరు జిల్లా నరసరావు పేట, అల్లూరు జిల్లా, అనంతపురం పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. అయితే, తాము కోర్టు అనుమతి తీసుకున్నామని, ముందుగా పోసానిని తమకే అప్పగించాలని నరసరావుపేట పోలీసులు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
పోసానిపై ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో ఆయనను ముందుగా ఎవరికి అప్పగించాలనే దానిపై ఉన్నతాధికారులతో జైలు అధికారులు సమాసలోచనలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతధికారుల అనుమతితో నరసరావు పేట పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments