జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ నెల 14న పిఠాపురంలో పార్టీ 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. సభలో పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు. ప్రభుత్వంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సభ ఉండబోతుందని వెల్లడించారు. ఈనెల 14న పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ సభను నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందన్నారు.
ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను దూషించిన వారి గురించి ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడారో మనం చూశాం. నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.
ఇలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైలులో కూర్చొని లబోదిబోమంటున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ వంటి నేతలను తిడితే హీరోలు కాదు జీరోలు అవుతారని స్పష్టం చేశారు.