Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మాయం... క్రిమినల్ చర్యలు తప్పవు : మంత్రి నాదెండ్ల

Nadendla

ఠాగూర్

, బుధవారం, 18 డిశెంబరు 2024 (11:47 IST)
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాముల్లో రేషన్ బియ్యం మాయమైన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పేర్ని నాని భార్య పేర్ని జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోదాములో రేషన్ బియ్యం మాయమైన ఘటనలో పోలీస్, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారన్నారు.
 
ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు. మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. పేర్ని జయసుధ పేరిట ఉన్న గిడ్డంగిలో 3 వేల బస్తాలు కాదు... 4840 బస్తాలు మాయమయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వంలో బాధ్యత కలిగిన పదవిలో ఉండి... ప్రజలు అప్పగించిన బాధ్యత ఎంత దారుణంగా నిర్వర్తించారో సాక్ష్యాధారాలతో ప్రజల ముందుపెడతామన్నారు.
 
మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన జేఎస్ గోడౌన్స్‌లో స్టాక్ ఎంత ఉంది...? అనే సమాచారాన్ని స్టాక్ రిజిస్టర్ బట్టి ప్రాథమిక సమాచారాన్ని జాయింట్ కలెక్టర్ నుంచి డిసెంబర్ 4వ తేదీన తెప్పించుకున్నాం. డిసెంబర్ 10న సివిల్ సప్లైస్ ఎండీ చట్టప్రకారం డబుల్ పెనాల్టీ వేయాలని, జేఎస్ గోడౌన్‌ను బ్లాక్ లిస్టులో ఉంచాలని నిర్ణయించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వేబ్రిడ్జ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల పొరపాటున స్టాక్ తగ్గింది అని జేఎస్ యాజమాన్యం చెబుతోంది. వీళ్లు మరిచిపోయారో... లేక విచారణలో బయటకు రాదని అనుకుంటున్నారో కానీ... విచారణలో అన్నీ బయటికి వస్తాయి. పక్కనే ఉన్న సత్య వేర్ హౌస్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందనిగానీ, స్టాక్ తగ్గిందని చెప్పలేదని మంత్రి నాదెండ్ల గుర్తు చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులు... బలైపోయిన మెదక్ జిల్లా వ్యక్తి