Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలంటే ఆ నాలుగు ఉండాల్సిందే : మంత్రి నాదెండ్ల భాస్కర్

free gas cylinder

ఠాగూర్

, మంగళవారం, 5 నవంబరు 2024 (13:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల్లో దీపం-2 పథకం కింద ఉచిత వంట గ్యాస్ సిలిండర్‌ను పంపిణీ చేస్తుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా పొందాలంటే ఎల్పీజీ కనెక్షన్‌తో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానమై ఉండాలని ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 
 
మరోవైపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం-2) పంపిణీలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు సంప్రదించడానికి వీలుగా 1967 టోల్ ఫ్రీ నెంబరును అందబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో, 1967 టోల్ ఫ్రీ నెంబరు పనితీరు ఎలా ఉందన్న విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం స్వయంగా పరిశీలించారు. విజయవాడ నగరంలోని పౌరసరఫరాల భవన్‌‌లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1967 కార్యాలయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. అధికారులు ఈ సందర్భంగా దీపం-2 పథకం వివరాలు తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దీపావళి నుండి అందిస్తున్న దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు బుక్ అయినవి 16,47,000 సిలిండర్లు కాగా... సమాచారం కోసం టోల్ ఫ్రీ నెం.1967కు ఫోన్ చేసి 3000 మంది తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇలా ఉచిత సిలెండర్ కోసం బుక్ చేసుకున్న దీపం-2 లబ్దిదారులకు ఆయిల్ కంపెనీల నుంచి ఇలా మెసేజ్ వస్తుంది. 
 
"మొదటి సిలిండర్ కోసం నమోదు చేసుకొన్నందుకు శుభాకాంక్షలు. లబ్ధిదారులు సిలిండరు కోసం ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. ఈ చెల్లించిన మొత్తం, మీరు సిలిండర్ డెలివరీ తీసుకున్న 48 గంటలలో మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుందని తెలియచేస్తున్నాము' అని వినిపిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో జగన్ ఫోటో వున్న చొక్కా ధరించిన అంబటి రాంబాబు (video)