Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపం 2.0 పథకం కింద ఉచిత సిలిండర్ కావాలంటే ఇవి ఉండాల్సిందే..

free gas cylinder

ఠాగూర్

, ఆదివారం, 3 నవంబరు 2024 (14:54 IST)
ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా యేడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇచ్చే పథకాన్ని దీపావళి పండుగ రోజు నుంచి ప్రారంభించింది. ఈ పథకానికి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే, ఈ పథకానికి తాము అర్హులమా కాదా? అనే అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులతో పోలిస్తే అర్హుల సంఖ్య తక్కువగా ఉంది. ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ వర్తింపజేస్తున్నామని.. వాటి వివరాలు లేకపోవడంతోనే అర్హుల సంఖ్య తగ్గిందని అధికారులు వివరిస్తున్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 1.54 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉంటే.. తాత్కాలిక అంచనా ప్రకారం ఉచిత సిలిండర్‌కు 1.08 కోట్ల కనెక్షన్లు అర్హత పొందాయి. కానీ, రేషన్ కార్డులు 1.48 కోట్లు ఉన్నాయి. కొంత మందికి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్నా.. ఆధార్ ఇవ్వకపోవడంతో అర్హత పొందలేకపోయారు. వీరంతా ఆధార్ అనుసంధానించుకుంటే 'దీపం 2.0' పథక అర్హుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 
 
మరోవైపు, లబ్ధిదారుల సందేహాలకు అధికారులు వివరణ కూడా ఇచ్చారు. వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరగా ఉండాలని సూచించారు కుటుంబ సభ్యులలో ఎవరి పేరుమీద కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే రాయితీ వస్తుందని, భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా అర్హులేనని తెలిపారు. 
 
ఒక రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు/మూడు కనెక్షన్లున్నా.. రాయితీ ఒక్క కనెక్షన్ వర్తిస్తుందని, టీడీపీ హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకూ 'దీపం '2.0' పథకం వర్తిస్తుందని, గ్యాస్ రాయితీ జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని, ఆన్‌సైన్ లేదా డీలర్ వద్దకెళ్లి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 
 
సిలిండర్ అందాక 48 గంటల్లో ఇంధన సంస్థలే రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయని, ఏదేని సమస్యలుంటే 1967 (టోల్ ఫ్రీ) నంబరుకు ఫోన్ చేయొచ్చని, గ్రామ/వార్డు సచివాలయాల్లో, తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారుల్ని సంప్రదించవచ్చని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైక్ రైడ్‌ను రద్దు చేసిన మహిళ... అసభ్య వీడియోలతో డ్రైవర్ వేధింపులు...