Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

03-11 - 2024 నుంచి 09-11-2024 వరకు వార ఫలితాలు

Advertiesment
weekly horoscope

రామన్

, శనివారం, 2 నవంబరు 2024 (23:58 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కీలక వ్యవహారాలతో తీరిక ఉండదు. సమయస్ఫూర్తిగా మెలగండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. శుక్రవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. దూరపు బంధువులు ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
 
పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పాతమిత్రులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. మార్కెటింగ్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తుల వారికి సామాన్యం. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
 
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానానికి శుభయోగం. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. ఉద్యోగసులకు పనిభారం, విశ్రాంతిలోపం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
 
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. గురువారం నాడు నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. జూదాలు, బెట్టింగ్ జోలికిపోవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. సంప్రదింపులకు అనుకూలం. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు 
వివరాలు వెల్లడించవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు ఆస్కారం ఉంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు స్థానచలనం. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయుల ప్రోత్సాహం మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. అధికారులకు మీ సామర్ధ్యంపై గురి కుదురుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు బాగుంటుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా మెలగండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణవేదికలు అన్వేషిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. ఆశయసాధనకు మరింత శ్రమించాలి. బుద్ధిబలంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. సామరస్యంగా మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వనసమారాధనల్లో పాల్గొంటారు. 
 
ధనురా రాశి :  మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో వ్యవహరించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే. త్వరలో శుభవార్తలు వింటారు. ఇంటి విషయాలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుతుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. గృహమార్పు అనివార్యం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో తపిప్రదాలను సరిదిద్దుకుంటారు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం ప్రథమార్థం అనుకూలదాయకం. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సంతానానికి శుభయోగం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వనసమారాధనల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలమే. కార్యసిద్ధి, ధనలాభం ఉంది. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. పనులు చురుకుగా సాగుతాయి. తరుచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కనిపించుకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. సంతానానికి శుభయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. మీ పథకాలు సత్ఫలితాస్తాయి. ఉద్యోగస్తులు పురస్కారాలు అందుకుంటారు. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. సమష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. మీ ఆధిపత్యం కొనసాగుతుంది. కీలక విషయాలపై పట్టుసాధిస్తారు. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మొండి బాకీలు వసూలువుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ప్రియతములు గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. స్థల వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-11-2024 ఆదివారం ఫలితాలు-రుణసమస్యలు తొలగుతాయి