Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజంపేట జైలు ఖైదీ నంబర్ 2261గా పోసాని కృష్ణమురళి

Advertiesment
Posani Krishna murali

ఠాగూర్

, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (15:39 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టు అయిన సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి రాజంపేట జైలు అధికారులు నంబరు కేటాయించారు. పోసానీ ఖైదీ నంబర్ 2261గా వెల్లడించారు. 
 
ఈ కేసులో పోసానిని గురువారం రాత్రి 9 గంటల వరకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారించారు. ఆ తర్వాత రాత్రి 9.30 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టారు. ఉదయం 5 గంటల వరకు కోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. పోసానికి బెయిల్ మజూరు చేయాలని కోరారు. 
 
అయితే, కోర్టు మాత్రం అందుకు నిరాకరించింది. పోసానికి మార్చి 13వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి పోసాని చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకు వస్తాయని అభిప్రాయపడ్డారు. దీంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయడానికి న్యాయమూర్తి నిరాకరించారు.
 
బయట ఆడుకుంటున్న చిన్నారి - అపహరించి అఘాయిత్యం - ప్రైవేట్ భాగాలపై 28 కుట్లు! 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఇంటిలో ఒంటరిగా ఉన్న చిన్నారిని ఓ కామాంధుడు కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. పైగా, ఆ బాలిక ప్రైవేట్ భాగాలపై 28 కుట్లుపడ్డాయి. శరీరం మొత్తం గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె గ్వాలియర్‌లోని కమలా రాజా ఆస్పత్రిలో ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. 
 
శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతుంది. నిద్ర కూడా పోవడం లేదు. ప్రైవేట్ భాగాలు, ముఖం, దవడలపై తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి పడకపై పక్కకు కూడా తిరగలేని పరిస్థితిలో ఉంది. అంతగా ఆమె శరీరం గాయాలపాలైంది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన 17 యేళ్ల నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ దారుణ ఘటన ఈ నెల 22వ తేదీ రాత్రి జరిగింది. పొరుగునవున్న ఝాన్సీ జిల్లాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు ఆ బాలిక తాత, నానమ్మ ఆస్పత్రికి వెళ్లారు. దీన్ని అవకాశంగా తీసుకున్న పక్కింటిలోని కుర్రోడు ఈ పాడుపడినికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడుని బహిరంగంగా ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం.. పేరు మర్చిపోయిన యాంకర్ (video)