Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే వస్తాను... మీ అందర్నీ కలుస్తాను.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (14:40 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేలా కనిపిస్తున్నారు. ఆయన బుధవారం కలికిరికి రాగా, ఆయనకు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కలికిరి రహదారులు, భవనాల శాఖ అతిథి గృహానికి ఉదయం 12:20 గంటలకు చేరుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, రాష్ట్ర పీసీసీ కార్యదర్శి కేఎస్‌ అఘామోహిద్దీన్‌, జిల్లా కాంగ్రెస్‌ మాజీ కార్యదర్శి డాక్టర్‌ శ్రీవర్ధన్‌, పలువురు నాయకులు, అభిమానులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యకర్తలు, అభిమానులను పేరుపేరునా పలకరిస్తూ వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. 
 
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తన స్వగ్రామం నగిరిపల్లెలో కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ పనుల నిమిత్తం కలికిరికి వచ్చినట్లు సమాచారం. కలికిరిలో అందరినీ పలకరించిన ఆయన 'త్వరలో వస్తా.. అందరితో కలుస్తా.. అందుబాటులో ఉంటా.. అప్పుడు అందరం కూర్చోని మాట్లాడుకుందాం' అని చెప్పారు. తన పని పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments