ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా సినిమా టిక్కెట్లను విక్రయించే విధానాన్ని నూతనంగా తీసుకొచ్చింది. దీనికి న్యాయస్థానం సైతం సమ్మతం తెలిపింది. ఇపుడు ఈ ఆన్ లైన్ టిక్కెట్లను విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా యువర్ స్క్రీన్ పేరుతో ఓ పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు.
యువర్ స్క్రీన్ పోర్టల్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే అదనపు చార్జీల మోత ఉండబోదన్నారు. యువర స్క్రీన్ పోర్టల్ వినియోగం ద్వారా బ్లాక్ టిక్కెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని ఆయన తెలిపారు. ప్రేక్షకులకు తక్కువ ధరకే టిక్కెట్లు అందుబాటులో తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలోనే యువర్ స్క్రీన్ పోర్టల్ ద్వారా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపారు.